ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో పండుగ హిట్‌కు శ్రుతి సిద్ధం

ABN, First Publish Date - 2021-04-25T05:30:00+05:30

‘క్రాక్‌’తో సంక్రాంతికి సూపర్‌ హిట్‌ అందుకున్నారు హీరోయిన్‌ శ్రుతీహాసన్‌. ఆ తర్వాత పవన్‌ కల్యాణ్‌కు జంటగా నటించిన ‘వకీల్‌ సాబ్‌’తో ఉగాదికి ప్రేక్షకుల ముందుకొచ్చి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు శ్రుతీ. ఆమె విజయ్‌ సేతుపతి సరసన కథానాయికగా నటించిన చిత్రం ‘లాభమ్‌’. ఈ సినిమాను రంజాన్‌ సందర్భంగా విడుదల...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రవితేజ సరసన నటించిన ‘క్రాక్‌’తో సంక్రాంతికి సూపర్‌ హిట్‌ అందుకున్నారు హీరోయిన్‌ శ్రుతీహాసన్‌. ఆ తర్వాత పవన్‌ కల్యాణ్‌కు జంటగా నటించిన ‘వకీల్‌ సాబ్‌’తో ఉగాదికి ప్రేక్షకుల ముందుకొచ్చి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు శ్రుతీ. ఆమె విజయ్‌ సేతుపతి సరసన కథానాయికగా నటించిన చిత్రం ‘లాభమ్‌’. ఈ సినిమాను రంజాన్‌ సందర్భంగా విడుదల చేయనున్నట్టు సేతుపతి ట్విట్టర్లో తెలిపారు. దీంతో శ్రుతీహాసన్‌ నటించిన మరో చిత్రం పండుగ రిలీజ్‌కు సిద్ధమౌతోంది. సంక్రాంతి, ఉగాది పండుగలకు హిట్‌ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న శ్రుతి ‘లాభమ్‌’ చిత్రంతో రంజాన్‌  పండుగకు మరో హిట్‌ కొట్టడం ఖాయం అంటున్నారు అభిమానులు. ‘లాభమ్‌’ చిత్రానికి దివంగత దర్శకుడు ఎస్‌పీ జననాథన్‌ దర్శకత్వం వహించారు. డి ఇమ్మాన్‌ సంగీతం అందించారు. జగపతిబాబు కీలకపాత్రలో నటించారు.

Updated Date - 2021-04-25T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising