ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీ మహాలక్ష్మీదేవి

ABN, First Publish Date - 2021-10-11T05:30:00+05:30

ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో బెజవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో బెజవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారు దర్శనమిస్తారు. మంగళప్రదమైన దేవత మహాలక్ష్మీదేవి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనే రూపాల్ని ధరించి ఆదిపరాశక్తి దుష్ట రాక్షస సంహారం చేసిందనీ, క్షీరాబ్ధి పుత్రికగా అవతరించిన లక్ష్మీదేవి డోలాసురుడనే రాక్షసుణ్ణి సంహరించిందనీ పురాణాలు చెబుతున్నాయి. రెండు చేతులలో కమలాలు ధరించి, అభయ, వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ... గజరాజు సేవిస్తుండగా శ్రీమన్మహాలక్ష్మి భక్తులను అనుగ్రహిస్తుందంటారు పెద్దలు. కనకదుర్గ అమ్మవారిని మహాలక్ష్మి రూపంలో అర్చిస్తే ధన , కనక, వస్తు, వాహన ప్రాప్తి కలుగుతుందనీ, సుఖ సంతోషాలు చేకూరుతాయనీ విశ్వాసం.


నైవేద్యం: రవ్వ కేసరి, గారెలు, చిత్రాన్నం, పాయసం

అలంకరించే చీర రంగు: ఎరుపు

అర్చించే పూలు: తామర పుష్పాలు

పారాయణ: చెయ్యాల్సింది: లక్ష్మీ స్తోత్రాలు

Updated Date - 2021-10-11T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising