ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంటిని సర్దేయండిలా!

ABN, First Publish Date - 2021-03-25T05:30:00+05:30

ఫ్లోర్‌పై వస్తువులు కనిపించకూడదని అన్నీ తీసుకెళ్లి ఏ డైనింగ్‌ టేబుల్‌ పైనో, కిటికీల్లోనో పెట్టేస్తుంటాం. రోజూ వాడే మిక్సీలు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎంత సర్దినా ఒక్కోసారి ఇల్లు ఇల్లులా కనిపించదు. ఎక్కడో అక్కడ వస్తువులు అడ్డం తగులుతూనే ఉంటాయి. మనకు తెలియకుండానే కొన్నింటిని వదిలేస్తూ పోతుంటాం. అలాంటి వాటివల్లే ఇల్లు కళ కోల్పోతుంది. అలా కాకుండా అద్దంలా ఉండాలంటే... 


 ఫ్లోర్‌పై వస్తువులు కనిపించకూడదని అన్నీ తీసుకెళ్లి ఏ డైనింగ్‌ టేబుల్‌ పైనో, కిటికీల్లోనో పెట్టేస్తుంటాం. రోజూ వాడే మిక్సీలు, గ్రైండర్లు, వాటర్‌ ఫిల్టర్లు అయితే ఓకే... చిన్నా చితక ఐటెమ్స్‌ కూడా వాటి పక్కనే పేర్చేసుకొంటూ పోతే చూడ్డానికి బాగుండదు. సౌకర్యంగానూ ఉండదు. 


 ఇక ఇప్పుడే తీసేద్దాం అనుకొంటూ రకరకాల వస్తువులు పెడుతుంటాం. అవి అక్కడే మట్టికొట్టుకుపోతుంటాయి. ఒక్కసారి తలపైకెత్తి చూస్తే చాలా అసౌకర్యంగా, ఇరుగ్గా అనిపిస్తుంది. కనుక వారం వారం కాకపోయినా కనీసం నెలకోసారి అయినా ఫ్రిజ్‌పైన శుభ్రం చేయాలి. 


 కిచెన్‌లో వంట చేసే హడావుడిలో పప్పులు, ఉప్పుల డబ్బాలు ఒకదానిపై ఒకటి పెట్టేస్తుంటాం. దానివల్ల కావల్సిన వంట సామగ్రి వెంటనే తీసుకోవడం కష్టమవుతుంది. కనుక శ్రమ అనుకోకుండా వాటిని తీసిన చోటే తిరిగి పెట్టడం అలవాటు చేసుకోవాలి. 


 బయట నుంచి రాగానే గుమ్మం ముందర చెప్పులు ఎలా పడితే అలా వదిలేస్తుంటారు అలాకాకుండా షూ స్టాండ్స్‌లో మాత్రమే పాదరక్షలు పెట్టేలా చూసుకోండి. 


 విడిచిన బట్టలు కుప్పలు కుప్పలుగా మూలన పడేయడంవల్ల ఇంట్లో ఏదో తెలియని అసౌకర్యానికి లోనవుతాము. ఎంత సర్దినా ఏరోజుకారోజు ఆ కుప్ప కొత్తగా వస్తూనే ఉంటుంది. కనుక విడిచిన బట్టలను ఎప్పటికప్పుడు వాషింగ్‌ మిషన్‌లో పడేస్తుంటే ఈ సమస్య తలెత్తదు.   


Updated Date - 2021-03-25T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising