ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సబ్జా - షియా... ఏది మేలు?

ABN, First Publish Date - 2021-11-02T05:30:00+05:30

సబ్జా, షియా... ఈ రెండూ ఒకటేనా? ఏది ఎక్కువ ఆరోగ్యకరం? వీటిని ఎలా తీసుకోవాలి? ఇలా ఈ విత్తనాల గురించిన....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సబ్జా, షియా... ఈ రెండూ ఒకటేనా? ఏది ఎక్కువ ఆరోగ్యకరం? వీటిని ఎలా తీసుకోవాలి? ఇలా ఈ విత్తనాల గురించిన అనుమానాలు ఉన్నాయా? అయితే వీటి గురించి కొంత అవగాహన పెంచుకుందాం!


సబ్జా, షియా... ఈ రెండింట్లో సమాన పోషక విలువలుంటాయి. అధిక బరువు తగ్గాలి అనుకునేవాళ్లకు ఇవి రెండూ సూపర్‌ ఫుడ్సే! ఈ రెండింటినీ నీళ్లలో నానబెట్టి తీసుకోవచ్చు. అయితే చూడడానికి ఒకేలా ఉండడంతో రెండూ ఒకటేనని పొరపాటు పడుతూ ఉంటాం. అయినా ఫర్వాలేదు. పోషకాలపరంగా రెండూ ఉత్తమమైనవే! అయితే నీళ్లలో నానబెట్టే సమయాలు రెండిటికీ భిన్నంగా ఉంటాయి. మధ్య, దక్షిణ మెక్సికో నుంచి వచ్చిన షియా విత్తనాలలో పీచు, ఒమేగా - 3, ప్రొటీన్లు ఉంటాయి. మన దేశానికి చెందిన తులసి విత్తనాలైన సబ్జాలో ఛాతీలో మంట, శరీరంలోని టాక్సిన్లను తగ్గించే గుణాలుంటాయి. ఇక షియా విత్తనాలు నానడానికి కనీసం అరగంట సమయమైనా పడుతుంది. సబ్జా విత్తనాలు నీళ్లలో వేసిన క్షణాలలోపే నాని, ఉబ్బిపోతాయి. షియా విత్తనాలు నీళ్లలో నాని, బరువెక్కి, జెల్‌లాగా మారి పాత్ర అడుగుకు చేరుకుంటాయి. నానిన తర్వాత వాటి అసలు బరువుకు పదింతలు పెరుగుతాయి. సబ్జా విత్తనాలు నీళ్లలో క్షణాల్లో నానిపోయి, వాటి చుట్టూ పారదర్శక పొర ఏర్పడుతుంది. 


ఇలా వాడుకోవాలి: షియా విత్తనాలను నానబెట్టి లేదా నానబెట్టకుండా నేరుగా కూడా తినవచ్చు. కానీ సబ్జా విత్తనాలను కచ్చితంగా నానబెట్టిన తర్వాతే తీసుకోవాలి. స్మూదీలు, మిల్క్‌షేక్స్‌లో షియా, సబ్జా రెండింటినీ కలుపుకుని తాగవచ్చు. సబ్జా విత్తనాలు లెమనేడ్స్‌, సలాడ్స్‌లో కూడా బాగుంటాయి. 


బరువు తగ్గాలంటే: షియా, లేదా సబ్జా ఈ రెండింట్లో దేన్నైనా మధ్యాహ్న భోజనం లేదా రాత్రి భోజనానికి అరగంట ముందు నీళ్లలో నానబెట్టి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల కడుపు నిండుగా మారి, అతిగా తినే కోరిక తగ్గిపోతుంది.

Updated Date - 2021-11-02T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising