ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోషకాలకు పవర్‌హౌజ్‌!

ABN, First Publish Date - 2021-11-28T08:08:36+05:30

గుమ్మడికాయ విత్తనాల్లో ప్రోటీన్లు, మెగ్నీషియం, జింక్‌, మాంగనీస్‌, ఐరన్‌ పుష్కలంగా లభిస్తాయి. ....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుమ్మడికాయ విత్తనాల్లో ప్రోటీన్లు, మెగ్నీషియం, జింక్‌, మాంగనీస్‌, ఐరన్‌ పుష్కలంగా లభిస్తాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని దూరం  చేయడంలో సహాయపడతాయి. అంతేకాదు, ఈ విత్తనాల్లో ఉండే ట్రిప్టోఫాన్‌ అనే అమైనో యాసిడ్‌ మెలటోనిన్‌ అనే హార్మోన్‌ ఉత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తుంది. మెలటోనిన్‌ను స్లీప్‌ హార్మోన్‌ అని కూడా పిలుస్తారు. ఇది గాఢనిద్ర పోయేందుకు సహాయపడుతుంది. గుమ్మడి విత్తనాలు రక్తంలో షుగర్‌ స్థాయిలను తగ్గిస్తాయని వెల్లడైంది. గుమ్మడి విత్తనాలను పాలతో కలిపి తీసుకుంటే ప్రయోజనాలు రెట్టింపవుతాయి. ఈ డ్రింక్‌ ఎలా తయారుచేసుకోవాలంటే...


కావలసినవి

ఒక కప్పు గుమ్మడికాయ విత్తనాలు, ఉప్పు, మేపుల్‌ సిరప్‌ ఒక టేబుల్‌స్పూన్‌, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ అర టీస్పూన్‌, యాలకుల పొడి చిటికెడు.


ఇలా చేయాలి...

  గుమ్మడి విత్తనాలను కనీసం ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి.

  నానబెట్టిన విత్తనాలను మిక్సీలో వేసి నాలుగు కప్పుల నీళ్లు, మేపుల్‌ సిరప్‌ వేసి బ్లెండ్‌ చేసుకోవాలి. 

 తరువాత పాత్రలోకి వడగట్టుకోవాలి. తగినంత ఉప్పు, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌, యాలకుల పొడి వేసి మరోసారి బ్లెండ్‌ చేసి ఫ్రిజ్‌లో పెట్టుకుని చల్లచల్లని డ్రింక్‌ సిప్‌ చేయాలి.

Updated Date - 2021-11-28T08:08:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising