ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధిక బరువు తగ్గించే పొటాషియం

ABN, First Publish Date - 2021-09-14T05:30:00+05:30

అధిక బరువు తగ్గించడంలో మ్యాక్రోన్యూట్రిఎంట్లు కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి బరువును అదుపులో ఉంచే పోషకాలతో పాటు అధిక బరువును తగ్గించే పోషకాలకు కూడా ఆహారంలో చోటు కల్పించాలి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అధిక బరువు తగ్గించడంలో మ్యాక్రోన్యూట్రిఎంట్లు కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి బరువును అదుపులో ఉంచే పోషకాలతో పాటు అధిక బరువును తగ్గించే పోషకాలకు కూడా ఆహారంలో చోటు కల్పించాలి. పొటాషియం రక్తపోటును నిలకడగా ఉంచడంతో పాటు, నాడీ వ్యవస్థ పనితీరును చురుగ్గా ఉంచుతుంది. కణాలకు పోషకాల సరఫరా సక్రమంగా జరిగేలా చేస్తుంది. వ్యాయామం తదనంతరం అలసిన కండరాలు కోలుకోవడానికి తోడ్పడుతుంది. కాబట్టి ఆరోగ్యకరమైన వ్యక్తి రోజుకు 4,700 మిల్టీగ్రాముల పొటాషియం తీసుకోవాలి. ఇందుకోసం ఈ ఆహార పదార్థాలను తీసుకోవాలి.


అరటిపండు: ఒక మీడియం సైజు అరటిపండులో 422 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది. యాంటీఆక్సిడెంట్లతో పాటు పుష్కలంగా పీచు ఉంటుంది. కాబట్టి రోజుకో అరటిపండు తింటూ ఉండాలి.

స్వీట్‌ పొటాటో: బరువు తగ్గాలనుకునేవారికి అనువైన ఈవినింగ్‌ స్నాక్‌ ఇది. దీన్లో స్టార్చ్‌ ఎక్కువగా ఉన్నప్పటికీ, పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం, విటమిన్‌ సి, బి12 పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఒక మీడియం సైజు చిలకడదుంపలో 541 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది.

కిడ్నీ బీన్స్‌: వీటిలో ప్రొటీన్‌, పొటాషియం, పీచు ఎక్కువ. ప్రొటీన్‌, పీచు కడుపు నింపిన సంతృప్తిని అందిస్తే, పొటాషియం శరీరంలోని ఎలకొ్ట్రలైట్‌ స్థాయిని స్థిరంగా ఉంచుతుంది. ఫోలేట్‌, ఐరన్‌, రాగి, విటమిన్‌ కె, మాంగనీసు కలిగి ఉండే 100 గ్రాముల కిడ్నీ బీన్స్‌లో 1406 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది.

Updated Date - 2021-09-14T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising