ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంట్లోనే పార్లర్‌ !

ABN, First Publish Date - 2021-05-01T05:44:02+05:30

ఆకర్షణీయంగా కనిపించడం కోసం బ్యూటీ పార్లర్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. అందాన్ని పెంచే సౌందర్య చికిత్సలు ఇంట్లోనూ చేసుకోవచ్చు. అదెలాగంటే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆకర్షణీయంగా కనిపించడం కోసం బ్యూటీ పార్లర్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. అందాన్ని పెంచే సౌందర్య చికిత్సలు ఇంట్లోనూ చేసుకోవచ్చు. అదెలాగంటే...


మొటిమలు వదలడం కోసం వేప ఆకును మెత్తగా నూరి ముఖానికి పట్టించి, పూర్తిగా ఆరిన తర్వాత కడిగేయాలి. ఇలా వారం రోజుల పాటు చేస్తే, మొటిమలు, వాటి తాలూకు మచ్చలు తగ్గుతాయి.

తేనె, నిమ్మరసం సమపాళ్లలో కలిపి అందులో ముంచిన కాటన్‌ బాల్‌తో ముఖంపై రాసుకోవాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడుక్కోవాలి. చర్మరంధ్రాలు శుభ్రపడడానికి ఈ చిట్కా బాగా పనిచేస్తుంది.

చర్మం కాంతులీనాలంటే ప్రతి రోజూ ఉసిరి రసం తాగాలి. రెండు ఉసిరి కాయలను ముక్కలుగా తరిగి, గ్లాసు నీళ్లు చేర్చి మిక్సీలో రసం తయారుచేసుకోవాలి. ఈ రసంలో చక్కెర కలపకుండా తాగాలి. 

టీస్పూన్‌ చొప్పున పసుపు, మీగడలను కలిపి, ముఖానికి పూసుకుని ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేయడం వల్ల   చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.  

గానుగ నుంచి తీసిన కొబ్బరినూనె చర్మానికి, వెంట్రుకలకు మేలు చేస్తుంది. వెంట్రుకలు పట్టులా మారాలంటే కొబ్బరినూనెను కొద్దిగా వేడిచేసి, కుదుళ్లకు పట్టించి, మర్దన చేయాలి. గంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేయాలి.

చర్మం మురికి వదిలాలంటే శనగపిండిలో కొద్దిగా మీగడ కలిపి, నలుగు పెట్టుకోవాలి. అరగంట తర్వాత స్నానం చేస్తే చర్మం నునుపుగా మారుతుంది.

వేసవి ఎండకు చర్మం కమిలిపోయినప్పుడు గంధం అరగదీసి, రోజ్‌వాటర్‌ కలిపి రాసుకోవాలి.

వెంట్రుకలు పట్టుకుచ్చులా మారాలంటే పెరుగు పట్టించాలి.

Updated Date - 2021-05-01T05:44:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising