ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిణీతి చోప్రా ఆకుపచ్చని రహస్యం

ABN, First Publish Date - 2021-06-12T05:30:00+05:30

సెలబ్రిటీలు తమ ఫిట్‌నెస్‌ విశేషాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటారు. అయితే బాలీవుడ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సెలబ్రిటీలు తమ ఫిట్‌నెస్‌ విశేషాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటారు. అయితే బాలీవుడ్‌ కథానాయిక పరిణీతి చోప్రా కాస్త ముందడుగేసి తన డైట్‌ ప్లాన్‌లో జ్యూస్‌ గురించి చెప్పింది. గ్రీన్‌ జ్యూస్‌ ఇప్పుడు నాకో అడిక్షన్‌ అంటూ ఓ ఫోటో షేర్‌ చేసింది. దాని పేరు గ్రీన్‌ జ్యూస్‌. బచ్చలికూర, బీట్‌రూట్‌, ఆరెంజ్‌, పుదీనతో చేసే జ్యూస్‌’ అని చెప్పుకొచ్చింది. మూడ్‌ను బట్టి ఈ ఆకుపచ్చని రసంలోకి నిమ్మరసం కలుపుతుందట పరిణీతి చోప్రా. 



ఆరోగ్యానికి మంచిదే

ఈ జ్యూస్‌తో రక్తహీనత సమస్య రాదు. ఆరెంజ్‌, నిమ్మ వల్ల విటమిన్‌-సి తో పాటు ఐరన్‌ లభిస్తుంది. బీట్‌రూట్‌ వల్ల హైబీపీ రాదు. ఆక్సిజన్‌ బాగా అందుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ వల్ల కడుపులో మంట తగ్గుతుంది. చర్మసౌందర్యానికి కూడా ఈ జ్యూస్‌ మంచిదే. మొత్తానికి పరిణీతి చోప్రా గత మార్చి నుంచి టర్కీలో ఉంటోంది. అక్కడ సముద్రం ఒడ్డులో సేదతీరుతున్న ఫొటోలు, పూలతోటలో తిరగాడుతూ, జిమ్‌ వీడియోలతో పాటు ఇలా తన ఆహార విశేషాలను ఇలా ఇన్‌స్టాలో పంచుకుంటోంది.


Updated Date - 2021-06-12T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising