ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చీరకట్టుతో విన్యాసం!

ABN, First Publish Date - 2021-01-13T05:48:49+05:30

శరీరాన్ని విల్లులా వంచుతూ గాల్లో ముందుకీ, వెనక్కీ పల్టీ కొట్టడానికి ఎంతో సాధన కావాలి. ఈ విన్యాసాన్ని వర్కవుట్‌ డ్రెస్‌లో ఎవరైనా చేస్తారు. కానీ పరుల్‌ అరోరా మాత్రం చీరకట్టులో ఫ్రంట్‌,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శరీరాన్ని విల్లులా వంచుతూ గాల్లో ముందుకీ, వెనక్కీ పల్టీ కొట్టడానికి ఎంతో సాధన కావాలి. ఈ విన్యాసాన్ని వర్కవుట్‌ డ్రెస్‌లో ఎవరైనా చేస్తారు. కానీ పరుల్‌ అరోరా మాత్రం చీరకట్టులో ఫ్రంట్‌, బ్యాక్‌ ఫ్లిప్స్‌ చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. ఆమె చీరకట్టుకొని చేసిన ఫ్లిప్స్‌ వీడియో ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌ అవుతోంది. ఇంతకీ ఎవరీ పరుల్‌...  


పరుల్‌ అరోరా స్వస్థలం హరియణాలోని అంబాల. ఇంతకీ ఆమె ఈ ఛాలెంజ్‌ను స్వీకరించడానికి కారణం ఏంటో తెలుసా... ‘‘స్వతహాగా జిమ్నాస్ట్‌ అయిన నేను ఫ్లిఫ్స్‌ ఈజీగా చేస్తాను. ఎప్పుడూ డ్రెస్‌లోనే ఈ విన్యాసాలను చేసేదాన్ని. ఈ విన్యాసాలను చీరకట్టులో ఎందుకు చేయకూడదు అని ఒకరోజు అనిపించింది. ఆలోచన రాగానే ఆచరణలో పెట్టాను.


గాల్లో ముందుకీ, వెనక్కీ దుముకుతూ ఒక చేతితో చీరను పట్టుకోవడం కొంత సవాల్‌గా అనిపించింది. అయితేనేం మొదటి ప్రయత్నంలోనే చక్కగా చేశాను. రోజు ఉదయం, సాయంత్రం గంటపాటు నేను ఈ ఫ్లిఫ్స్‌ సాధన చేస్తాను’’ అంటున్న పరుల్‌ అరోరా గత పదిహేనేళ్లలో దాదాపు 35 జాతీయ జిమ్నాస్టిక్స్‌ పోటీల్లో పాల్గొన్నారు. చీరకట్టుతో ఆమె చేసిన ఫ్రంట్‌, బ్యాక్‌ ఫ్లిఫ్స్‌ వీడియోలు చూసిన వారంతా ‘వావ్‌... భలే చేసింది’ అంటున్నారు. బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ పరుల్‌ విన్యాసం వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీల్లో పోస్ట్‌ చేశారు కూడా.




ఇంటర్నెట్‌లో సంచలనం అయ్యారిలా... 

ఒకప్పుడు జాతీయ స్థాయిలో బంగారు పతకం కూడా గెలిచిన ఈ జిమ్నాస్ట్‌ ప్రస్తుతం ఫిట్‌నెస్‌, జిమ్నాస్టిక్స్‌ శిక్షకురాలిగా మారారు. ఆమె ఎందుకు ప్రొఫెషనల్‌జిమ్నాస్టిక్స్‌ను వదిలేశారంటే... ప్రతిభ, నైపుణ్యం ఉన్నప్పటికీ ఆమెకు జాతీయ స్థాయి పోటీలకు వెళ్లేందుకు అవసరమైన శిక్షణ, మార్గనిర్దేశనం అందలేదు. దానికి తోడూ కుటుంబం ఆర్థిక పరిస్థితులు ఆమెను ప్రొఫెషనల్‌ కెరీర్‌కు ముగింపు పలికేలా చేశాయి. 

‘‘జాతీయ స్థాయిలో నేను ఎంతగా రాణించినా, మరింత ముందుకు వెళ్లేందుకు కావాల్సిన మద్దతు, సహాయం అందదు. మా కుటుంబం నడవాలంటే నేనూ ఎంతో కొంత సంపాదించాల్సిన పరిస్థితి. అందుకే ఫిట్‌నెస్‌, జిమ్నాస్టిక్‌ శిక్షకురాలిగా మారాను’’ అంటున్న పరుల్‌ తన ఫిట్‌నెస్‌ వీడియోలతో ఇంటర్నెట్‌లో సంచలనంగా మారారు. 


Updated Date - 2021-01-13T05:48:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising