ఒక్కసారి కమిట్ అయితే...
ABN, First Publish Date - 2021-03-14T06:02:23+05:30
‘‘పండక్కి వస్తానని కమిట్ అయ్యా. పండక్కే వస్తున్నా. ఎందుకంటే... ఒక్కసారి కమిట్ అయితే (నా మాట నేనే వినను)’’ అని సల్మాన్ ఖాన్ అంటున్నారు
‘‘పండక్కి వస్తానని కమిట్ అయ్యా. పండక్కే వస్తున్నా. ఎందుకంటే... ఒక్కసారి కమిట్ అయితే (నా మాట నేనే వినను)’’ అని సల్మాన్ ఖాన్ అంటున్నారు. ప్రభుదేవా దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’. రంజాన్ సందర్భంగా ఈ ఏడాది మే 13న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. సల్మాన్ శనివారం ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. ‘పోకిరి’ హిందీ రీమేక్ ‘వాంటెడ్’లో డైలాగ్‌ను గుర్తు చేశారు. టైటిల్లోనూ మోస్ట్ వాంటెడ్‌ను హైలైట్ చేస్తున్నారు. ఆ సినిమా తరహాలో ఉంటుందని చెబుతున్నారు. నిజానికి, గత ఏడాది మే 22న రంజాన్ సందర్భంగా ‘రాధే’ విడుదల చేయాలని అనుకున్నారు. అయితే, కరోనా వల్ల వాయిదా వేయక తప్పలేదు. మళ్లీ ఈ ఏడాది రంజాన్ సమయంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాలో దిశా పటానీ హీరోయిన్. రణదీప్ హుడా, జాకీ ష్రాఫ్, మేఘా ఆకాశ్ ఇతర తారాగణం.
Updated Date - 2021-03-14T06:02:23+05:30 IST