ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒలింపిక్స్‌ ‘ఇయర్‌’ రింగ్స్‌!

ABN, First Publish Date - 2021-07-29T05:30:00+05:30

క్రీడాకారులు వారి ఆటతో పాటు, ధరించే ఆభరణాలతో కూడా క్రీడాభిమానుల మనసులను దోచుకుంటూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్రీడాకారులు వారి ఆటతో పాటు, ధరించే ఆభరణాలతో కూడా క్రీడాభిమానుల మనసులను దోచుకుంటూ ఉంటారు. ఇందుకోసం స్వయంగా తయారు చేయించుకున్న జ్యువెలరీని ఆటల్లో ధరిస్తూ ఉంటారు. అయితే ఆ ఆభరణాల వెనక ఆసక్తికరమైన కథలు దాగి ఉంటాయి.


ఒలింపిక్స్‌ రింగ్స్‌ రూపంలో...

ఒలింపిక్స్‌ వెయిట్‌లిఫ్టింగ్‌లో రజత పతకం దక్కించుకున్న మీరాబాయి చాను, ఒలింపిక్స్‌ రింగ్స్‌ను తలపించే బంగారు చెవి కమ్మలు ధరించి క్రీడాభిమానులను అలరించింది. వీటిని చాను తల్లి సాయిఖోం తోంబీ దేవి బహూకరించడం విశేషం. ఇందుకోసం ఆవిడ, ఐదేళ్ల క్రితం నాటి తన బంగారు ఆభరణాలను మార్చి, కూతురి కోసం ఒలింపిక్స్‌ రింగ్స్‌ను మరిపించే ఇయర్‌ రింగ్స్‌ తయారు చేయించింది. 


సెరీనా వజ్రాల కమ్మలు...

ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణి సెరీనీ విలియమ్స్‌ తను ఆడిన ఎక్కువ మ్యాచుల్లో వజ్రాల ఇయర్‌ రింగ్స్‌ ధరించి కనిపిస్తుంది. 13 కేరట్ల వజ్రాలతో కూడిన డ్రీమ్‌ క్యాచర్‌ స్టడ్స్‌ను కూడా ఇష్టంగా ధరిస్తుంది. ప్రారంభంలో ఇదే తరహాలో 8 కేరట్ల ఇయర్‌ స్టడ్స్‌ ధరించేది. ఆ తర్వాత అదే మోడల్‌ స్టడ్స్‌ను 13 కేరట్ల వజ్రాలతో తయారు చేయించుకుంది. సెరీనాకు ‘సెరీనావిలియమ్స్‌జ్యువెలరీ’ పేరుతో సొంత జ్యువెలరీ కలెక్షన్‌ కూడా ఉంది. 

Updated Date - 2021-07-29T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising