ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యోగా...ఒక సాంకేతిక విజ్ఞానం

ABN, First Publish Date - 2021-03-19T05:30:00+05:30

ఆధ్యాత్మిక ప్రక్రియ, యోగ విజ్ఞానం అనేవి మతాల ఆవిర్భావానికి పూర్వమే ఉన్నాయి. యోగ శాస్త్రం మన సంస్కృతిలో పుట్టి పెరిగింది కాబట్టి, దీనికి కొందరు హిందుత్వ ముద్ర వేస్తున్నారు. మన దేశ సంస్కృతికి మాండలిక స్వభావం ఉంది. యోగ శాస్త్రంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆధ్యాత్మిక ప్రక్రియ, యోగ విజ్ఞానం అనేవి మతాల ఆవిర్భావానికి పూర్వమే ఉన్నాయి. యోగ శాస్త్రం మన సంస్కృతిలో పుట్టి పెరిగింది కాబట్టి, దీనికి కొందరు హిందుత్వ ముద్ర వేస్తున్నారు. మన దేశ సంస్కృతికి మాండలిక స్వభావం ఉంది. యోగ శాస్త్రంలో కూడా ఆయా ప్రాంతాల ప్రత్యేకతలకు స్థానం కల్పించారు. మన సంస్కృతిలో మానవునికి ఉండే ఒకే ఒక లక్ష్యం ముక్తి. ఈ జీవన విధానం నుండి, జీవితానికి సంబంధించిన ప్రతి పరిమితి నుండి ముక్తి పొందడం. ఆ పరిమితిని అధిగమించడం. ఈ సంస్కృతిలో మానవుని తుది గమ్యం భగవంతుడు కాదు. భగవంతుడు కేవలం మెట్టు మాత్రమే! ఈ భూగోళంలో భగవంతుడి గురించి ఒక కచ్చితమైన అభిప్రాయం లేనిది ఈ సంస్కృతి మాత్రమే! ఒక రాయిని, చెట్టును, మీ మాతృమూర్తిని, ఆవును... ఇలా దేనినైనా పూజించవచ్చు - మీరు దేన్ని ఆరాధించాలనుకుంటే దాన్నే ఆరాధించవచ్చు. ఎందుకంటే ఈ సంస్కృతిలో మనమే దేవుడిని తయారు చేసుకుంటాం. 


కొన్ని సంస్కృతులలో ‘భగవంతుడు మనల్ని తయారు చేశాడు’ అని నమ్ముతారు. మనం మనకు ఎక్కడ గురి కుదురుతుందో అక్కడ మన ఆరాధనను నిలుపుతాం. మనం భగవంతుని తయారుచేసే ఒక సాంకేతికతను అభివృద్ధి చేశాం. కేవలం రూపాలను సృష్టించడం కాదు, వాటికి శక్తిని కల్పించాం. ఎటువంటి శక్తిని అంటే... అది మన జీవితంలోని ఒకానొక ప్రత్యేక కోణాన్ని స్పృశించటానికి అది దోహదం చేస్తుంది. అది రాతిని భగవంతునిగా మలచే శాస్త్రం... ప్రతిష్టించే శాస్త్రం. మానవుడిని తన సంపూర్ణ క్షమత అందుకునేలా చేసే శాస్త్రం. యోగాలో ఉండడం అంటే సృష్టిలోని ఏకత్వాన్ని అనుభూతి చెందడం. 


ఎవరైనా, దేనినైనా ఆరాధించే వీలు, అసలు దేనినీ ఆరాధించనక్కరలేని వెసులుబాటు ఉన్న ఈ సంస్కృతిలో యోగకు మాత్రం ఇటువంటి పరిమితులు ఎలా ఉంటాయి? వాస్తవంగా చెప్పాలంటే... యోగ ఒక సాంకేతిక విజ్ఞానం. ఇది కుల, మత, ప్రాంతాలకు అతీతమైన విజ్ఞానం. యోగ ప్రక్రియలను ఉపయోగించుకోవడానికి ‘మనం ఏ మతానికి చెందినవారం’ అనే విషయంతో సంబంధం లేదు, ఎందుకంటే యోగా ఒక సాంకేతికత. దాన్ని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. ఏదైనా సాంకేతికత మీద మీకు నమ్మకం ఉండవచ్చు, లేకపోవచ్చు. కానీ ‘మీరు నమ్ముతున్నారా? లేదా?’ అనే వ్యత్యాసాన్ని సాంకేతికత చూపదు. అది అందరికీ ఒకే విధమైన ఫలితాన్ని ఇస్తుంది. మన నమ్మకం మన మానసిక ప్రక్రియకు సంబంధించినది. దానికీ, సాంకేతికత వినియోగానికీ ఎలాంటి సంబంధమూ లేదు. గురుత్వాకర్షణ సూత్రాన్ని కనుక్కున్న న్యూటన్‌ క్రైస్తవ సంస్కృతిలో జీవించారు. అంతమాత్రాన ఆ సూత్రం క్రైస్తవ మతానికి చెందినది అనలేం కదా? కాబట్టి సాంకేతిక విజ్ఞానమైన యోగాకు మతాల రంగులు అద్దడం హాస్యాస్పదం. 

సద్గురు జగ్గీవాసుదేవ్‌

Updated Date - 2021-03-19T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising