ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసలైన కుటుంబం!

ABN, First Publish Date - 2021-06-11T05:30:00+05:30

ఒకసారి ఏసు ప్రభువును కలుసుకోవడానికి ఆయన తల్లి, సోదరులు వచ్చారు. ఆ సమయంలో తన చుట్టూ చేరిన అనేకమంది వ్యక్తులకు ఆయన బోధ చేస్తున్నాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒకసారి ఏసు ప్రభువును కలుసుకోవడానికి ఆయన తల్లి, సోదరులు వచ్చారు. ఆ సమయంలో తన చుట్టూ చేరిన అనేకమంది వ్యక్తులకు ఆయన బోధ చేస్తున్నాడు. 

ఇది గమనించిన కొందరు వ్యక్తులు ‘‘మీ తల్లి, సోదరులు వచ్చారు. మీతో మాట్లాడడానికి బయట నిలబడ్డారు’’ అని ఆయనకు చెప్పారు. 

అప్పుడు ఏసు ‘‘ఎవరు నా తల్లి? ఎవరు నా సోదరులు?’’ అని ప్రశ్నించాడు. తన శిష్యులను చూపిస్తూ ‘‘ఇదిగో వీళ్ళే నా తల్లి, వీళ్ళే నా సోదరులు. పరలోకంలో ఉన్న నా తండ్రి అభీష్టాన్ని నెరవేర్చే వారే నా తల్లి, నా సోదరులు, నా అక్కాచెల్లెళ్ళు’’ అని చెప్పాడు. 

తల్లితండ్రులు, తోడబుట్టినవారు, రక్తసంబంధీకులు, దూరపు బంధువులు... ఇవి మానవులకు పుట్టుకతోనే ఏర్పడే బంధాలు. కానీ ఆధ్యాత్మిక అనుబంధంలో ఇవేవీ పరిగణనలోకి రావు. ఒక విశ్వాసికి... దేవుడు చూపిన దారిలో నడిచే సాటి విశ్వాసులే బంధువులు, ఆత్మీయులు అవుతారు. దైవమే ఆ కుటుంబానికి యజమాని. ఆధ్యాత్మిక ప్రపంచంలో లౌకిక బంధాలకు ఉన్న విలువ చాలా పరిమితం. అలాగని ఏసు ప్రభువు మాటల్లో తన తల్లి పట్ల కానీ, సోదరుల పట్ల కానీ అగౌరవం లేదు. వారు వచ్చిన సమయంలో... దైవ సందేశాన్ని విశ్వాసులకు ఏసు బోధిస్తున్నాడు. ఇటువంటి దైవ కార్యాల్లో నిమగ్నమైనప్పుడు భౌతిక బంధాల వైపు దృష్టి మరల్చకూడదు. దేవుడి సేవకులకు తోటి విశ్వాసులే అసలైన కుటుంబం. తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సింది దానికేననీ,  ఈ భూమి మీద ఏర్పడిన బంధాల కన్నా మానవుల ఉనికికి కారణమైన... దైవ సంబంధమైన బంధాలే ముఖ్యమనీ ఈ ఉదంతంతో ఏసు ప్రభువు విశ్వాసులందరికీ స్పష్టం చేశాడు.


Updated Date - 2021-06-11T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising