ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ రంగనాథుడు గిరిజనుల బావగారు!

ABN, First Publish Date - 2021-06-25T05:30:00+05:30

అభయారణ్యం మధ్య, సమున్నతమైన కొండల్లో భక్తులకు అభయప్రదాతగా కొలువైన స్వామి బిలిగిరి రంగనాథుడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అభయారణ్యం మధ్య, సమున్నతమైన కొండల్లో భక్తులకు అభయప్రదాతగా కొలువైన స్వామి బిలిగిరి రంగనాథుడు. కర్ణాటక రాష్ట్రంలోని చామరాజనగర జిల్లాలో ఉన్న ఈ ప్రాంతానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. పశ్చిమ కనుమల్లో, సముద్ర మట్టానికి 5,091 అడుగుల ఎత్తున బిలిగిరి రంగనాథ ఆలయం ఉంది. 


పూర్వం ఈ అడవిని ‘చంపకారణ్యం’ అని పిలిచేవారు. ‘చంపకం’ అంటే సంపెంగ. ఈ ఆలయం చుట్టూ ఇప్పటికీ వందలాది సంపెంగ చెట్లు ఉన్నాయి. ప్రధానంగా రెండువేల ఏళ్ళ నాటిదిగా స్థానికులు పేర్కొనే ‘దొడ్డ సంపిగె మార’ (భారీ సంపెంగ చెట్టు) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అలాగే ఏనుగులు సంచరించే అటవీ ప్రాంతం కాబట్టి ‘గజారణ్య’ అని కూడా వ్యవహరించేవారు. ప్రస్తుతం బిలిగిరిరంగబెట్ట లేదా బి.ఆర్‌.హిల్స్‌గా ఇది ప్రసిద్ధి చెందింది. శ్వేతాద్రి అని కూడా పిలుస్తారు. ఆ స్వామి పేరు మీదే ఈ అటవీ ప్రాంతాన్ని బిలిగిరి రంగనాథ స్వామి ఆలయ (బిఆర్‌టి) వన్యప్రాణి అభయారణ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎకో టూరిజం కేంద్రంగా కూడా బి.ఆర్‌.హిల్స్‌ అభివృద్ధి చెందుతోంది. 




ఈ ఆలయ ప్రస్తావన బ్రహ్మాండపురాణంలో కనిపిస్తుంది. పూర్వం వశిష్ట మహర్షి ప్రార్థన మేరకు మహా విష్ణువు ఆయనకు దర్శనమిచ్చాడు. ఆ సందర్శనకు గుర్తుగా ఈ ఆలయాన్ని వశిష్టుడు నిర్మించాడని స్థల పురాణం చెబుతోంది. స్థానికంగా ప్రచారంలో ఉన్న జానపద గాథ ప్రకారం, కుసుమబాల అనే సోలిగ తెగకు చెందిన గిరిజన యువతిని శ్రీ రంగనాథస్వామి ప్రేమించి, వివాహమాడాడు. తమ ఆడపడుచు భర్తగా, బావగారుగా ఆ తెగవారు ఈ రంగనాథుణ్ణి గౌరవిస్తారు. ఆలయంలో జరిగే ఉత్సవాల్లో పాల్గొని సేవలు చేస్తారు. రెండేళ్ళకొకసారి, స్థానిక గిరిజనులు స్వామివారికి చర్మంతో చేసిన పెద్ద చెప్పుల జత సమర్పించుకుంటారు. ఆ చెప్పుల కొలత ఒక అడుగు తొమ్మిది అంగుళాలు ఉంటుంది. 

రంగనాథస్వామి నిలబడిన భంగిమలో కనిపించే అరుదైన ఆలయాల్లో ఇదొకటి. గర్భగుడిలోని స్వామి విగ్రహం తిరుమల శ్రీ వేంకటేశ్వరుణ్ణి తలపిస్తుంది. సీతాన్వేషణలో ఉన్న శ్రీరామ లక్ష్మణులు ఈ ప్రాంతంలో పూజలు చేశారని ‘శ్వేతాచల మహాత్మ్యం’ గ్రంథం చెబుతోంది. శ్రీ రంగనాథ ఆలయం పక్కనే... స్వామివారి దేవేరి శ్రీ రంగనాయకి అమ్మవారి సన్నిధి ఉంది. ఇటీవలే ఈ ఆలయ పునరుద్ధరణ జరిగింది.


Updated Date - 2021-06-25T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising