ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వారిదే కీలకపాత్ర!

ABN, First Publish Date - 2021-03-05T06:04:43+05:30

కాలం మారుతున్నా, తరాలు గడుస్తున్నా, మహిళలు అన్ని రంగాల్లో పురోగమిస్తున్నా ఇప్పటికీ వారికి సమాజంలో తగిన రక్షణ లేదు. పుట్టబోయేది ఆడబిడ్డ అని తెలుసుకొని... తల్లి గర్భంలోనే కడతేర్చడం దగ్గర నుంచి... ముక్కుపచ్చలారని చిన్నారుల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాలం మారుతున్నా, తరాలు గడుస్తున్నా, మహిళలు అన్ని రంగాల్లో పురోగమిస్తున్నా ఇప్పటికీ వారికి సమాజంలో తగిన రక్షణ లేదు. పుట్టబోయేది ఆడబిడ్డ అని తెలుసుకొని... తల్లి గర్భంలోనే కడతేర్చడం దగ్గర నుంచి... ముక్కుపచ్చలారని చిన్నారుల నుంచి వయోధికులైన మహిళల వరకూ... బడుల నుంచి పని ప్రదేశాల దాకా జరుగుతున్న అఘాయిత్యాలూ, అత్యాచారాలకు అంతులేదు. క్రీస్తుశకం ఏడవ శతాబ్దానికి పూర్వం అరబ్బు దేశాల్లో కూడా మహిళల పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉండేది. దైవప్రవక్త మహమ్మద్‌ ఈ ధోరణులను నిరసించారు. మహిళలను తక్కువగా చూసే ధోరణిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆడబిడ్డలను ఆదరంగా పెంచి, వివాహం జరిపించే వారే స్వర్గానికి అర్హులని ఆయన చెప్పారు. వితంతు పునర్వివాహాలను ఆయన ప్రోత్సహించారు. స్వయంగా వితంతు వివాహం చేసుకున్నారు. ‘కుటుంబ వ్యవస్థలో పురుషునికి మహిళ సహాయకారిణి.


అంతమాత్రాన ఆమె పురుషునికన్నా తక్కువ కాదు. ఇంటికి ఇల్లాలే మహారాణి’ అని ఇస్లాం చెబుతోంది. కుటుంబ నిర్వహణలోనూ, సమాజంలోనూ వారి స్థానం కల్పించింది. కుటుంబ ఆస్తుల్లో వారికి వాటాను నిర్దేశించింది. దాంపత్య జీవితంలో పురుషులు, మహిళల హక్కులు బాధ్యతలను నిర్ణయించింది. వాటి అమలుకు దోహదం చేసింది. విద్యావంతుడైన ప్రతి పురుషుడు ‘తల్లి ఒడి’ అనే బడిలో ప్రాథమిక శిక్షణ ముగించుకుంటాడు.  అందుకే తల్లిగా, తొలి గురువుగా గొప్ప పాత్రను వహించే మహిళలకు పురుషులతో పాటు విద్యను సమాన హక్కుగా ఇస్లాం ప్రకటించింది. ఈ మార్పులన్నీ కేవలం చట్టాలు, తీర్మానాల వల్ల సంభవించినవి కావు. వీటన్నిటినీ ఇస్లాం ధర్మంలో భాగం చేయడంతో పాటు, వాటిని ఆచరించడం వల్ల ప్రాపంచిక జీవనంలోనే కాకుండా, పరలోక జీవితంలో కూడా ఉన్నత స్థానం పొందుతారని పవిత్ర గ్రంథమైన దివ్య ఖుర్‌ఆన్‌ స్పష్టం చేసింది.

మహమ్మద్‌ వహీదుద్దీన్‌ 

Updated Date - 2021-03-05T06:04:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising