ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసలైన విజేత

ABN, First Publish Date - 2021-08-06T05:38:48+05:30

మరణం ఏదో ఒకనాడు తథ్యం’ అనేది తిరుగులేని సత్యం. ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి మంచి చేసినా, చెడు చేసినా... దాని పూర్తి ఫలం దక్కేది అతనికే! ఈ ప్రపంచం ఒక మాయాజాలం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రణం ఏదో ఒకనాడు తథ్యం’ అనేది తిరుగులేని సత్యం. ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి మంచి చేసినా, చెడు చేసినా... దాని పూర్తి ఫలం దక్కేది అతనికే! ఈ ప్రపంచం ఒక మాయాజాలం. ఈ మాయలో చిక్కుకుపోకుండా అత్యంత లాఘవంగా తనను తాను కాపాడుకున్నవాడు ధన్యుడు. మాయోపాయాలలో, మోసపూరిత వలయంలో చిక్కుకున్నవాడు విఫలమవుతాడు. చాలామంది ప్రాపంచిక వ్యామోహంలో పడిపోతారు. ఇహమే స్వర్గమనీ, ఇల్లే సర్వస్వమనీ అనుకుంటారు. ఫలితంగా పరమార్థాన్ని మరచిపోయి పెడతోవ పడతారు. ఇష్టానుసారం, జవాబుదారీతనం లేకుండా వ్యవహరిస్తారు. 


‘‘ప్రతి ప్రాణీ మృత్యువును రుచి చూడవలసిందే. ప్రళయ దినాన మీరందరూ మీ కర్మలకు పూర్తి ఫలితాన్ని పొందుతారు. అప్పుడు ఎవడు నరకాగ్నినుంచి రక్షణ పొంది, స్వర్గంలో ప్రవేశం పొందుతాడో... అతడు నిశ్చలంగా సఫలీకృతుడు అవుతాడు. ఈ ప్రాపంచిక జీవితం ఒక మాయా వస్తువు తప్ప మరేం కాదు’’ అని దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ స్పష్టపరిచారు. ‘తాను ఏ గడ్డపై మరణిస్తాడో ఎవరికీ తెలీదు’ అంటుంది దివ్య ఖుర్‌ఆన్‌. మరణం ఎప్పుడు వస్తుంది? ఇంట్లో వస్తుందా? ఇంటి బయట వస్తుందా? స్వస్థలంలో వస్తుందా? విదేశీ గడ్డపై వస్తుందా? యుక్త వయసులోనే మృత్యువు కాటేస్తుందా? వృద్ధాప్యం వరకూ ఆగుతుందా? మనోవాంఛలన్నీ ఈడేరిన తరువాత మరణం వస్తుందా? లేక అంతకు ముందే వస్తుందా? ఈ ప్రశ్నలకు జవాబులు ఎవరికీ తెలీదు.అయితే ‘దైవం ఆజ్ఞ లేనంత వరకూ ఏ ప్రాణీ మరణించదు. 


ప్రతి దానికీ నిర్ధారిత సమయం రాసి ఉంది’ అని దివ్య ఖుర్‌ఆన్‌ చెబుతోంది. మరణ సమయం ముందుగానే నిర్ణీతమై ఉండగా, పిరికితనంతో పారిపోవలసిన అవసరం ఏముంది? అలా పారిపోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? మీరెక్కడ ఉన్నా సరే... మృత్యువు మిమ్మల్ని కబళిస్తుంది. అది ప్రతి ఒక్కరినీ వెంటాడుతూనే ఉంది. దూర ప్రాంతానికి వలస పోయినా, ఇంటిపట్టునే ఉండిపోయినా చావు రాకుండా ఉండదు. కాబట్టి, ఇంటినీ, బంధు మిత్రులనూ, స్వస్థలాన్నీ వదిలిపోవడానికి ఊగిసలాడకూడదు. మృత్యువుకు భయపడకూడదు. రావలసిన సమయంలో అది వచ్చి తీరుతుంది. అయితే, దైవారాధన చేస్తున్న స్థితిలో, దైవ విధేయులుగా ఉన్న స్థితిలో మరణించినవారు శాశ్వతమైన పరలోక సౌఖ్యాలను పొందుతారు. ఈ ప్రాపంచిక జీవితంలో... ఆ దైవం అభీష్టానికి అనుగుణంగా మసలుకొని, దానికి బహుమతిగా నరకాగ్ని నుంచి రక్షణ పొందిన వాడు, స్వర్గంలోని సంతోషాన్ని అందుకున్న వాడు అసలైన విజేత. 

మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Updated Date - 2021-08-06T05:38:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising