ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆధ్యాత్మిక సంగీత వైభవం

ABN, First Publish Date - 2021-04-16T05:30:00+05:30

అచంచలమైన తన భక్తికి సంగీత, సాహిత్యాలను ఆలంబనగా చేసుకున్న మహనీయుడు త్యాగరాజు. ఆయన కృతులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అచంచలమైన తన భక్తికి సంగీత, సాహిత్యాలను ఆలంబనగా చేసుకున్న మహనీయుడు త్యాగరాజు. ఆయన కృతులు పాడకుండా కర్ణాటక సంగీత కచ్చేరీ చేయడం దాదాపు అసాధ్యం... ఆయన సంగీతంపై వేసిన ముద్ర అలాంటిది. త్యాగరాజ సంగీత వైశిష్ట్యం గురించీ, ఆయన జీవితం గురించీ ఎన్నో పుస్తకాలు వచ్చాయి. తాజాగా సూరి వెంకటేశ్వర్లు వెలువరించిన ‘సంగీత జగద్గురు శ్రీ త్యాగరాజ స్వామి’ పుస్తకం కొంత భిన్నమైనది. దీనిలో  72 మేళ కర్త రాగాల నామాలు, వాటి స్వరస్థానాలు, ఏ రాగం సంఖ్య ఏదో గుర్తించే కటపయాది సూత్రం వివరణ లాంటి వివరాలతో పాటు మరి కొన్ని విశేషాలు ఉన్నాయి.


ఒకే రాగంలో త్యాగరాజు పది కన్నా ఎక్కువగా కూర్చిన కృతులు, మేళకర్త రాగాల క్రమంలో 736 త్యాగరాజ కృతుల వివరాలు, (మంగళంపల్లి బాలమురళీ కృష్ణ తరం వరకూ) అయిదు తరాల త్యాగరాజ శిష్య పరంపర, త్యాగరాజు ప్రశిష్యుడైన సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి శిష్య, ప్రశిష్యుల వివరాలు... ఇలా పలు అంశాలు ఆసక్తి కలిగిస్తాయి. ఇవి ప్రత్యేకించి సంగీత విద్యార్థులు అవశ్యం తెలుసుకోదగినవి. సంగీతరంగంలో ప్రముఖులు, అభిరుచి కలిగిన ఇతరుల రచనలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. త్యాగరాజ సంగీత వైభవాన్ని మరింతగా  అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకం దోహదం చేస్తుంది. 

సంగీత జగద్గురు శ్రీ త్యాగరాజస్వామి

సూరి వెంకటేశ్వర్లు

వెల: రూ.100,  ప్రతులకు: 9866668824


Updated Date - 2021-04-16T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising