ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిర్వాణం రెండు రకాలు

ABN, First Publish Date - 2021-09-17T05:30:00+05:30

బౌద్ధ సాహిత్యంలో తరచుగా కనిపించే పదం ‘నిర్వాణం’. దీనికే పాళీ భాషలో ‘నిబ్బానం’ అనే పర్యాయ పదం ఉంది. ఈ పదానికి నిరోధం, ఊది ఆర్పివేయడం, పునర్భవాన్ని నిరోధించేది, తృష్ణాక్షయం, కోర్కెల నిరోధం, జన్మ, జరా, మరణ దుఃఖాల నుంచి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బౌద్ధ సాహిత్యంలో తరచుగా కనిపించే పదం ‘నిర్వాణం’. దీనికే పాళీ భాషలో ‘నిబ్బానం’ అనే పర్యాయ పదం ఉంది. ఈ పదానికి నిరోధం, ఊది ఆర్పివేయడం, పునర్భవాన్ని నిరోధించేది, తృష్ణాక్షయం, కోర్కెల నిరోధం, జన్మ, జరా, మరణ దుఃఖాల నుంచి విముక్తి, రాగ, మోహ, ద్వేషాల వినాశనం... ఇలా ఎన్నో అర్థాలున్నాయి. నిర్వాణం రెండు రకాలు. ‘ఉపాధి శేష నిర్వాణం’.... పంచస్కంధాల విచ్ఛిన్నం జరగనప్పుడు... అంటే మనిషి జీవించి ఉన్నప్పుడు పొందే నిర్వాణం మొదటిది. బౌద్ధం ప్రకారం ఈ మార్గంలో సాధకుడు ‘స్రోతాపన్న’, ‘సకృదామి’, ‘అనాగామి’, ‘అర్హంత’ అనే నాలుగు స్థితులను పొందుతాడు. అర్హంతుడైన వ్యక్తి జీవించి ఉన్నప్పుడే ఈ ఉపాధి శేష నిర్వాణాన్ని పొందుతాడు. ఈ నిర్వాణాన్ని సాధించిన తరువాత ఆ వ్యక్తి మరణానంతరం పొందేది ‘అనుపాధి శేష నిర్వాణం’. బౌద్ధం అనాత్మ వాదం. కాబట్టి ఒకే ఆత్మ తిరిగి పుట్టే పునర్జన్మలను బౌద్ధం అంగీకరించదు. నామ (విజ్ఞానం), రూపా (దేహా)లతో మరణానంతరం విజ్ఞానం తిరిగి ఈ ప్రపంచంలో మరొక చోట వ్యక్తం అవుతుంది. దాన్ని ‘పునర్భవం’ అంటారు. ఈ పునర్భవ నిరోధమే నిర్వాణం.

Updated Date - 2021-09-17T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising