ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆయనకు కృతజ్ఞులమై ఉండాలి!

ABN, First Publish Date - 2021-01-29T07:01:23+05:30

ఇస్లాం ఒక పరిపూర్ణ జీవన విధానం. దైవానికి పరిపూర్ణమైన దాస్య భావనతో మెలిగే విధానం. ఈ ధర్మంలో ఆరాధనలకు ఎంతో ప్రాధాన్యం ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లాం ఒక పరిపూర్ణ జీవన విధానం. దైవానికి పరిపూర్ణమైన దాస్య భావనతో మెలిగే విధానం. ఈ ధర్మంలో ఆరాధనలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. దైవంతో మానవుడికి సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచడానికి ఆరాధనలు దోహదం చేస్తాయి. ఇస్లాం మౌలిక విశ్వాసాలలో ‘దైవం ఒక్కరే’ అనేది అత్యంత ప్రధానమైనది. అఖండమైన, అనంతమైన, బ్రహ్మాండమైన ఈ సృష్టికి ఏకైక కర్త అల్లాహ్‌ మాత్రమే. ఆయన అనంతుడు. ఆదిమధ్యాంతరహితుడు. అజరుడు, అమరుడు. అపార శక్తిమంతుడు. సర్వాంతర్యామి. సర్వాధికారి. సర్వజ్ఞుడు. సర్వ పోషకుడు. ఆయనను ఎన్ని పేర్లతో పిలిచినా తక్కువే. ఆయన గురించి ఎంత వివరించినా తక్కువే. ఎంత రాసినా తక్కువే. ఆయన వల్లే సృష్టి స్థిరంగా మనగలుగుతోంది. దాన్ని నడుపుతున్నది ఆయనే. దానిలోని ప్రతి వస్తువునూ ఆయన ఒకే చూపుతో గమనించగలడు. ప్రతి వస్తువు గురించీ ఆయనకు ప్రత్యక్షంగా తెలుసు. భూత, వర్తమాన, భవిష్యత్తులన్నీ ఆయన గ్రహించగలడు. 


‘‘అల్లాహ్‌. అద్వితీయుడు. నిరాపేక్షుడు. ఎవరి ఆధారమూ, ఎవరి అక్కరా లేనివాడు. అందరూ ఆయనపై ఆధారపడేవారే. ఆయనకు సంతానం ఎవరూ లేరు. ఆయన కూడా ఎవరి సంతానమూ కాదు. ఆయనకు సరిసమానులు ఎవరూ లేరు’’ అని దివ్య ఖుర్‌ఆన్‌ ప్రకటించింది. ‘‘ఆయన ఒక్కడే ప్రభువు. ఆయన పాలనలో ఎవరికీ భాగస్వామ్యం లేడు. స్వామి, పోషకుడు అయిన ప్రభువు మాత్రమే ఆరాధ్యుడు కాగలడు. విశ్వానికి కర్త ఆయన ఒక్కడే. ఈ సృష్టి క్రియలో ఆయనకు తోడెవరూ లేరు. రాజ్యాధికారం ఆయనది మాత్రమే. ఆయనకు పూర్వం ఏ దేవుడూ లేడు, ఆయన తరువాత కూడా మరే దైవమూ లేడు’’ అని పేర్కొంటోంది. అలాంటి అపార శక్తిమంతుడైన అల్లాహ్‌ సృష్టిలోని జీవకోటిలో మనకూ స్థానం దొరికినందుకు ఆయన పట్ల కృతజ్ఞులమై ఉండాలి. ఆయన నిర్దేశించిన మార్గంలో నడవాలి. ఆరాధనతో ఆయనకు సన్నిహితం కావాలి.

Updated Date - 2021-01-29T07:01:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising