ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్నిటికన్నా విలువైనది!

ABN, First Publish Date - 2021-06-18T09:29:39+05:30

మనిషి మొత్తం లోకాన్ని జయించవచ్చు. లోకంలో సంపద అంతా అతని సొంతం కావచ్చు. కానీ తనను తాను పోగొట్టుకుంటే... ఎన్ని సాధించినా ప్రయోజనం లేదన్నాడు ఏసు ప్రభువు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనిషి మొత్తం లోకాన్ని జయించవచ్చు. లోకంలో సంపద అంతా అతని సొంతం కావచ్చు. కానీ తనను తాను పోగొట్టుకుంటే... ఎన్ని సాధించినా ప్రయోజనం లేదన్నాడు ఏసు ప్రభువు. ‘‘నీ ఆత్మకన్నా విలువైనది ఇంకేముంది?’’ అని ప్రశ్నించాడు. ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలనే యావలో కొట్టుకుపోతున్న మనుషులకు సంతృప్తి ఉండదు. తోటి మనుషులతో సంబంధాలు ఉండవు. తనను తాను నాశనం చేసుకుంటాడు. చివరకు ఈ భూమి మీద నుంచి అతను తీసుకుపోయేది ఏదీ ఉండదు. అటు పరలోకం కోసం సంపాదించుకునేది కూడా ఉండదు. ఇహలోకానికీ, పరలోకానికీ... ఈ రెండిటికీ చెడిపోతాడు. 


మానవుల జీవితంలో ఎక్కువకాలం దేనికోసమో వెతుకులాటలోనే గడిచిపోతుంది. చాలామంది ఆలోచనలు ఎప్పుడూ తప్పుడు మార్గంలోనే వెళుతూ ఉంటాయి. లౌకికంగా మరింత సాధించాలనే కోరికతో, ఎన్నటికీ సాధ్యపడని వాటి కోసం చాలాసార్లు ప్రయత్నిస్తాం. దానికోసం మన శక్తిలో ఎక్కువ భాగం వృథా చేసుకుంటూ ఉంటాం. విపరీతమైన పరిస్థితులు ఎదురైనప్పుడు మాత్రమే దేవుడి గురించి ఆలోచిస్తాం. కానీ, నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి ప్రశ్నకూ సమాధానం దైవం నుంచే దొరుకుతుంది.. మానవ జీవితాలకు నిజమైన విలువ దైవాన్వేషణలోనే లభిస్తుంది. ఏ లక్ష్యానికైనా, మన బతుకుల్లోని ఏ ప్రయోజనాలకైనా కేంద్ర బిందువు దైవమే కావాలి. పరలోకంలో ఎలాంటి విలువా లేని వాటికి... ఈ లోకంలో ప్రాధాన్యం ఇస్తున్నందుకు దేవుణ్ణి క్షమాపణ వేడుకోవాలి. 

Updated Date - 2021-06-18T09:29:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising