ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీవితానికి అనువుగా మారాలి

ABN, First Publish Date - 2021-09-03T05:30:00+05:30

చాలామంది పిల్లలకూ, ఎదిగిన వారికీ కూడా వాళ్ళ శక్తి సామర్థ్యాల గురించి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. ఈ భయం వారికి ఒక సమస్యగా ఉంటుంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


చాలామంది పిల్లలకూ, ఎదిగిన వారికీ కూడా వాళ్ళ శక్తి సామర్థ్యాల గురించి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. ఈ భయం వారికి ఒక సమస్యగా ఉంటుంది. ఈ ఆత్మన్యూనతను ఎలా అధిగమించాలనేది వారిని వేధిస్తూ ఉంటుంది. ఈ ప్రశ్నకు సమాధానంగా ‘మిమ్మల్ని మీరు నమ్మండి’ అని అందరూ చెబుతూ ఉంటారని నాకు తెలుసు. కానీ నేను చెప్పేదేంటంటే.. ‘సరిగ్గా గమనించుకోండి’ అని. మంచి కావచ్చు, చెడు కావచ్చు... మీ జీవితంలో ఏది జరిగినా దీనికి కారణం మీరేనా? అని ఆలోచించుకోండి. అది మీరు కాకపోతే.. ఎదుటి వాళ్ళు కారణం కావచ్చా? అనేది పరిశీలించండి. కొంతమంది ఏదో భరోసాతో అందరినీ తోసుకుంటూ ముందుకు వెళ్తారు. వారికి తమ మీద లేదా వేరే వ్యక్తులు లేదా విషయాల మీద ఉన్న నమ్మకం... స్పష్టతలేని ఇలాంటి భరోసా ఇస్తుంది. ఈ భూమికీ, మన చుట్టూ ఉన్న జీవులకు జరిగే నష్టానికీ ముఖ్యమైన కారణం ఇలాంటి స్పష్టతలేని భరోసానే! ఎందుకంటే, మీరు చేసే పని గురించి సంకోచం ఉంటే, ఆ పని చేసేటప్పుడు పదిసార్లు ఆలోచిస్తారు. తెలివైన ప్రపంచం ఇలా ఉంటుంది. అందరికీ కాస్త సంకోచం ఉండాలి. ఆలోచనల్లో స్పష్టత ఉండాలి.


మనం భౌతికంగా, మానసికంగా ఎదుగుతున్నాం అంటే... ఆ ఎదుగుదలకు ఎన్నో కోణాలు ఉంటాయి. శారీరక, మానసిక, భావోద్వేగపరమైన ఎదుగుదలలు ఉంటాయి. మనం ఎదుగుదలను చాలాసార్లు శారీరకంగానే కొలుస్తాం. తరువాత మానసికంగా చూస్తాం. శరీరం మనకు కనిపించే అంశం. అది వేగంగానైనా, మెల్లగానైనా ఒక ఒరవడిలో ఉంటుంది. కానీ మనలో కలిగే మానసిక ఎదుగుదల కంటికి కనిపించేది కాదు. అది మృదువుగా, చురుగ్గా జరుగుతుంది. కాబట్టి శారీరకమైన ఎదుగుదలకన్నా అది ముందే జరిగిపోవాలి. ప్రతి బిడ్డా శారీరకంగా కన్నా మానసికంగా ఒక అడుగు ముందే ఎదిగేలా సమాజంలో పరిస్థితులు ఉండాలి. అప్పుడు చిన్న విషయాలకే దిగ్భ్రమ చెందడం లాంటివి జీవితంలో ఉండవు ఏ వయసులోనూ దేనికీ అమితమైన ఆశ్చర్యం కలగదు.

ప్రస్తుత సమాజంలో మనుషుల పరిస్థితి ఏమిటంటే... పసివారికి డైపర్‌ సమస్య, యువతకు హార్మోన్ల సమస్య, నడివయసు వారికి వారివైన సమస్యలు, ఇక వృద్ధాప్య సమస్య ఎలాగూ ఉంది. ప్రజలు ఏ సమయంలో బాధపడడం లేదో చెప్పండి? వారికి ఏది సమస్య కాదో చెప్పండి? జీవితం ఒక సమస్య కాదు. అదొక విధానం. ఆ విధానానికి అనువుగా మీరు తయారయ్యారా లేదా మారారా అనేదే ప్రశ్న. 

- సద్గురు జగ్గీవాసుదేవ్‌

Updated Date - 2021-09-03T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising