ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ వెలుగును అనుసరిద్దాం!

ABN, First Publish Date - 2021-04-16T05:30:00+05:30

‘అజ్ఞానం’ అంటే ‘ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నది దైవం’ అనే సత్యాన్ని తెలుసుకోలేకపోవడం. ఈ సత్యం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘అజ్ఞానం’ అంటే ‘ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నది దైవం’ అనే సత్యాన్ని తెలుసుకోలేకపోవడం. ఈ సత్యం తెలియకపోవడం వల్లనే మనుషులు తప్పుడు మార్గాల్లో పడుతున్నారు. దైవం పట్ల తమ విశ్వాసాన్ని పెంచుకోలేకపోతున్నారు. దైవానికి దగ్గర కాలేకపోతున్నారు. అజ్ఞానం అనే చీకటి ఎన్నో ప్రలోభాలను కలిగిస్తుంది. ఎన్నో సుఖాలను చూపిస్తుంది. ఆలోచనలనూ, అంతఃకరణనూ కప్పేస్తుంది. వెలుగును చూడాలనే ఆలోచన లేకుండా చేస్తుంది. ప్రస్తుత స్థితే సుఖంగా, సంతోషంగా ఉందనే భ్రమ కలిగిస్తుంది. లోకంలో ప్రతిరోజూ సూర్యుడు ఉదయిస్తాడు. అస్తమిస్తాడు. సూర్యుడు అస్తమించిన తరువాత లోకమంతా చీకటై పోతుంది. మళ్ళీ సూర్యోదయం వరకూ ఆ చీకట్లు లోకాన్ని ఆక్రమిస్తాయి.


అయితే, అజ్ఞానం ఆక్రమించిన మనిషి జీవితం ఇలా ఉండదు. అది పూర్తిగా చీకట్లోనే ఉంటుంది. ఒకసారి ‘జ్ఞానం’ అనే దీపాన్ని హృదయంలో వెలిగించుకున్న తరువాత ఇక చీకటికి అవకాశం ఉండదు. హృదయం ఎల్లప్పుడూ వెలుగులతో నిండి ఉంటుంది. ఆ వెలుగు ఎక్కడుంటుంది? దాన్ని జీవితంలోకి ఎలా తెచ్చుకోవాలి? హృదయంలో దాన్ని ఎలా నిలుపుకోవాలి? 





‘‘ఈ లోకానికి నేను వెలుగును’’ (యోహాను 8:12) అని ఏసు ప్రభువు స్పష్టంగా ప్రకటించాడు. మరి ఆ వెలుగును అందుకోవడం ఎలా? ‘‘నన్ను అనుసరించిన వారు ఎన్నడూ అంధకారంలో నడవరు. వాళ్ళకి జీవాన్ని ఇచ్చే వెలుగు వారికి ఉంటుంది’’ అని కూడా ఆయన స్పష్టం చేశాడు. విశ్వానికి వెలుగైన దైవ కుమారుడి దారి నుంచి వేరు పడినవారు, దూరమైనవారూ చీకటిలోనే మిగిలిపోతారు.


నిర్లక్ష్యంతో, అవివేకంతో చీకటిలోనే మిగిలిపోవాలనుకొనేవారికి చివరికి మిగిలేది నిస్సహాయత, నిస్పృహ మాత్రమే.  సముద్రంలో ఉన్న నావ సురక్షితమైన ప్రయాణం కోసం చుక్కానిని అనుసరించినట్టు జీవితాన్ని సురక్షితంగా సాగించడానికి ఏసు ప్రభువును దారి దీపంగా చేసుకోవాలి. ఆయన తన జీవితం ద్వారా, బోధల ద్వారా చూపించిన మార్గాన్ని అనుసరించాలి.


Updated Date - 2021-04-16T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising