ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దైవానుగ్రహం వారికే!

ABN, First Publish Date - 2021-10-01T05:30:00+05:30

దేవుడి దీవెనలు పొందగలిగేవారెవరు? ఆ అత్యున్నతమైన భాగ్యాన్ని అందుకొగలిగే అర్హత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేవుడి దీవెనలు పొందగలిగేవారెవరు? ఆ అత్యున్నతమైన భాగ్యాన్ని అందుకొగలిగే అర్హత ఎవరికి ఉంది? హృదయపూర్వకంగా కాకుండా పెదవుల చివరి నుంచి వచ్చే ప్రార్థనను దైవం ఆలకించడు. ఆయన ఆశీర్వాదాలు పొందడానికి కావలసింది అపారమైన సంపదలు, ఉన్నతమైన హోదాలు, అధికారం కాదు... నిర్మలమైన చేతులు, స్వచ్ఛమైన హృదయం అని చెబుతోంది పవిత్ర గ్రంథమైన బైబిల్‌. ‘‘యెహోవా పర్వతాన్ని ఎక్కగలిగేవారు ఎవరు? పవిత్రమైన ఆయన స్థలంలో నిలబడగలిగేవారు ఎవరు? అసత్యమైన, మోసపూరితమైన ప్రమాణాలు చేయనివారు... నిష్కళంకమైన చేతులు, స్వచ్ఛమైన హృదయం ఉన్నవారికే యెహోవా ఆశీస్సులు అందుతాయి. రక్షకుడైన దేవుడి నుంచి వారు నీతిని పొందగలుగుతారు’’ అని స్పష్టం చేస్తోంది (కీర్తనలు 24: 3-5) 


చేతులు మన చేతలను ప్రతిఫలిస్తాయి. హృదయం మన అంతరంగంలోని ఆలోచనలనూ, భావాలనూ ప్రతిబింబిస్తుంది. నిర్మలమైన చేతులు అంటే... ఎప్పుడూ మంచి పనులు చేయడం. స్వచ్ఛమైన హృదయం అంటే... ఎల్లప్పుడూ మంచి ఆలోచనలనూ, భావాలనూ కలిగి ఉండడం. అదే విధంగా సత్యాన్ని మాట్లాడాలి. ఎదుటివారిని మోసం చెయ్యడానికి అసత్యాలు మాట్లాడకూడదు. త్రికరణశుద్ధిగా... అంటే మనసా వాచా కర్మణా ధర్మబద్ధంగా జీవించే వారే దైవానికి దగ్గర కాగలరు. ఆయన రాజ్యంలో ప్రవేశించగలరు. ఆయన అనుగ్రహానికి పాత్రులు కాగలరు.

Updated Date - 2021-10-01T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising