ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుర్మార్గుల తీరు అంతే!

ABN, First Publish Date - 2021-03-05T06:01:47+05:30

యుద్ధం పాండవులు మొదలుపెట్టలేదు. వారిని లక్క ఇంట్లో పెట్టి కాల్చేసిందెవరు? అనేక రకాల ఆపదలకు గురి చేసిందెవరు? దుర్యోధనుడి బుద్ధి, సహాయపడిన కర్ణుడి బుద్ధి, అరాచకాలు చేస్తున్నా చూస్తూ ఊరుకున్న ద్రోణ, అశ్వత్థామల బుద్ధి ఎలాంటిదో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యుద్ధం పాండవులు మొదలుపెట్టలేదు. వారిని లక్క ఇంట్లో పెట్టి కాల్చేసిందెవరు? అనేక రకాల ఆపదలకు గురి చేసిందెవరు? దుర్యోధనుడి బుద్ధి, సహాయపడిన కర్ణుడి బుద్ధి, అరాచకాలు చేస్తున్నా చూస్తూ ఊరుకున్న ద్రోణ, అశ్వత్థామల బుద్ధి ఎలాంటిదో మారద వెంకయ్య రాసిన భాస్కర శతకంలోని ఒక పద్యం ద్వారా తెలుసుకుందాం.


ఊరక సజ్జనుండొదిగియుండిననైన దురాత్మకుండు ని

ష్కారణ మోర్వలేక యపకారము చేయుట వాని విద్యగా 

చీరెలు నూఱుటంకములు చేసెడివైనను బెట్టెనుండగా

జేరి చినింగిపో గొఱుకు చిమ్మటకేమి ఫలంబు భాస్కరా!


మంచివాడు తన పని తాను చేసుకుంటూ ఉన్నా సరే, పనికిమాలినవాడు పనిగట్టుకుని మరీ వాణ్ణి చెడగొడతాడు. వాడు బాగుపడడం ఇష్టం లేదు. ఎందుకంటే జీవితంలో వీడు ఎలాగూ బాగుపడడు. దానికి మంచి ఉదాహరణ ఏమిటంటే, పూర్వం చీరలను చెక్క పెట్టెల్లో దాచుకునే వాళ్లు.  చిమ్మెట అనే పురుగు  పెట్టెలో దూరి ఆ చీరలకు రంధ్రం పెట్టేది. చీరలు అపకారం చేయకపోయినా చిమ్మెట వచ్చి రంధ్రాలు చేసింది. పాండవులు రాజ్యం అడగకుండా, పెద్దవాళ్లు చెప్పినట్టు విని, వాళ్ల దారిన వాళ్లు బతుకుతూ ఉంటే, కౌరవులు లక్క ఇంటికి నిప్పు పెట్టారు కదా! 


గరికిపాటి నరసింహారావు

Updated Date - 2021-03-05T06:01:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising