ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాపత్రయం తగదు!

ABN, First Publish Date - 2021-02-12T08:16:12+05:30

పని చేస్తూ కూడా దాని తాలూకు బంధాల్లో ఇరుక్కుపోకుండా ఎలా ఉండాలో చెబుతున్నాడు శ్రీకృష్ణపరమాత్మ. అదే నిజమైన కర్మయోగం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పని చేస్తూ కూడా దాని తాలూకు బంధాల్లో ఇరుక్కుపోకుండా ఎలా ఉండాలో చెబుతున్నాడు శ్రీకృష్ణపరమాత్మ. అదే నిజమైన కర్మయోగం. ఇందులో కర్మను  విడిచి పెట్టడం కాదు. కర్మ తాలూకు తాపత్రయాలను, ఆందోళనలను, ఫలితాల మీద దృష్టిని విడిచిపెట్టాలి. అది ఎలాగో భగవద్గీత ఐదో అధ్యాయంలో ఎనిమిదో శ్లోకం, తొమ్మిదవ శ్లోకంలో చెప్పాడు. 


నైవ కించిత్‌ కరోమీతి యుక్తో మన్యేత తత్త్వవిత్‌

పశ్యన్‌ శృణ్వన్‌ స్పృశన్‌ జిఘ్రన్నశ్నన్‌ గచ్ఛన్‌ స్వపన్‌ శ్వసన్‌

ప్రలపన్‌ విసృజన్‌ గృహ్ణన్నున్మిషన్‌ నిమిషన్నపి

ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్‌


తత్త్వవేత్త అయినవాడు ‘నేను ఏ పనీ చేయడం లేదు’ అనుకుంటాడు. ‘పశ్యన్‌’... చూస్తున్నప్పటికీ, ‘శృణ్వన్‌’... వింటున్నప్పటికీ, ‘స్పృశన్‌’... ముట్టుకుంటున్నటికీ, ‘జిఘ్రన్‌’... వాసన చూస్తున్నప్పటికీ, ‘అశ్నన్‌’... తింటున్నప్పటికీ, ‘గచ్ఛన్‌’...నడుస్తున్నప్పటికీ, ‘స్వపన్‌’... నిద్రపోతున్నప్పటికీ, ‘శ్వసన్‌’... ఊపిరి తీసుకుంటున్నప్పటికీ, ‘ప్రలపన్‌’... మాట్లాడుతున్నప్పటికీ, ‘విసృజన్‌’...విసర్జిస్తున్నప్పటికీ, ‘గృహ్ణన్‌’.. ఏదైనా గ్రహిస్తున్నప్పటికీ, ‘ఉన్మిషన్‌’... కళ్లు తెరుస్తున్నప్పటికీ, ‘నిమిషన్‌’... కళ్లు మూస్తున్నప్పటికీ... ‘ఆ పనులు నేను చేయడం లేదు’ అనుకోవాలి. ఇంద్రియాలు ఇంద్రియార్థాల్లో ప్రవర్తిస్తున్నాయి. నాలుక రుచి చూస్తోంది. చెవి శబ్దం వింటోంది. కన్ను చూస్తోంది. ఇంద్రియాలు వాటి పనులు అవి చేస్తున్నాయి. ఊపిరిని లెక్కపెట్టామా? ఎన్నిసార్లు రెప్పవాలుస్తున్నామో లెక్కపెట్టామా? లెక్కపెట్టకపోయినా ఆ పనులు జరుగుతున్నాయి కదా! పనులన్నీ అలాగే జరగాలి. పనులు బాధ్యతగా చేయాలి. అంతేకానీ దాని ఫలితం గురించి తాపత్రయ పడకూడదు. ఆ సూక్ష్మాన్ని అర్థం చేసుకోవాలి.




గరికిపాటి నరసింహారావు

Updated Date - 2021-02-12T08:16:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising