ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆధ్యాత్మిక అన్వేషకుల కోసం..

ABN, First Publish Date - 2021-02-05T05:38:06+05:30

ఏమిటి? ఎందుకు ? ఎలా- ఈ మూడు ప్రశ్నలు మానవాభివృద్ధికి విశేషంగా దోహదపడ్డాయి. ప్రకృతిలో మన చుట్టూ ఉన్న విశేషాలను గమనించి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏమిటి? ఎందుకు ? ఎలా- ఈ మూడు ప్రశ్నలు మానవాభివృద్ధికి విశేషంగా దోహదపడ్డాయి. ప్రకృతిలో మన చుట్టూ ఉన్న విశేషాలను గమనించి.. వాటిని క్రోడీకరించి.. తులనాత్మక అధ్యయనం చేసి మన పూర్వీకులు మనకు విజ్ఞానాన్ని అందించారు. 


ఈ విజ్ఞాన శోధన ఒక నిరంతర ప్రక్రియ. కొనసాగుతూనే ఉంటుంది. ఇక మన కంటికి కనిపించనివి.. చెవులకు వినబడనవి.. స్పర్శకు అందనివి కొన్ని ఉన్నాయి. వాటి అన్వేషణకు కూడా మన పూర్వీకులు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు. అదే ఆధ్యాత్మిక మార్గం. ఒక వ్యక్తి ఈ మార్గంలో ప్రయాణించే సమయంలో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరికినప్పుడు ఆ అన్వేషకుడు మరింత వేగంగా ప్రయాణించగలుగుతాడు. కొన్ని వేల ఏళ్ల మానవ ఆధ్యాత్మిక ప్రస్థానంలో తలెత్తిన ప్రశ్నలు.. వాటికి లభించిన సమాధానాలను భారతీయ సంస్కృతి సముద్ధరణ సంస్థ పుస్తకాల రూపంలో ప్రచురిస్తోంది. ఈ సంస్థ నుంచి తాజాగా యజుర్వేద హృదయం, జిజ్ఞాస- పరిప్రశ్న అనే రెండు పుస్తకాలు వెలువడ్డాయి. యజుర్వేద హృదయంలో వేదాలకు సంబంధించిన వివరాలు లభిస్తే.. జిజ్ఞాస- పరిప్రశ్నలో ఆధ్యాత్మిక అన్వేషకులు ఎదురయ్యే అనేక ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి. ఆధ్యాత్మికపై ఆసక్తి ఉన్నవారు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకాలివి.


యజుర్వేద హృదయం

రచయిత : వారణాసి సుబ్రమణ్యం


జిజ్ఞాస- పరిప్రశ్న

రచయిత : యం.వి.ఎస్‌. ప్రసాద్‌ 

ప్రతులకు: 9849030890

Updated Date - 2021-02-05T05:38:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising