ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశ్వాసం అచంచలంగా ఉండాలి!

ABN, First Publish Date - 2021-07-16T05:30:00+05:30

ప్రతి విషయాన్నీ సందేహించడం మానవ ప్రవృత్తి. దైవం మీద నమ్మకం, విశ్వాసం ఉండాలన్న మాట మనం ఎప్పుడూ వింటూ ఉంటాం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రతి విషయాన్నీ సందేహించడం మానవ ప్రవృత్తి. దైవం మీద నమ్మకం, విశ్వాసం ఉండాలన్న మాట మనం ఎప్పుడూ వింటూ ఉంటాం.. ఆచరణలోకి వచ్చేసరికి... ఏదో ఒక దశలో మనసులో సందేహం కదలాడుతూనే ఉంటుంది. ‘‘దేవుడి మీద విశ్వాసాన్ని ఉంచండి. నేను మీతో సత్యం చెబుతున్నాను. ఈ కొండతో ‘‘నువ్వు పైకి లేచి, ఈ సముద్రంలో పడిపో!’’ అని చెప్పి, తాను అన్న ఆ మాట జరుగుతుందని ఎలాంటి సందేహం లేకుండా గట్టిగా విశ్వసించినట్టయితే, అది జరిగి తీరుతుంది. మీరు ప్రార్థనలో దైవాన్ని కోరుకొనేవి అన్నీ ఇప్పటికే మీ సొంతం అయ్యాయని విశ్వసించండి. అప్పుడు మీరు తప్పకుండా వాటిని పొందుతారు’’ అని ఏసు ప్రభువు చెప్పాడు. 

విశ్వాసం ఎలా ఉండాలి? అచంచలంగా ఉండాలి. ఎలాంటి సందేహానికీ తావులేనిదై ఉండాలి. మనం తలపెట్టిన పని ఏదైనా కావచ్చు... దానిలో గెలుపు అందుకోవాలంటే పూర్తి నమ్మకం ప్రధానం. చాలా సందర్భాలలో ఇలాంటి నమ్మకం మనలో కొరవడుతుంది. దైవంపై విశ్వాసం ఉంచి కృషి సాగించినవారు విజయాన్ని పొందుతారు. దైవ సంబంధమైన కార్యాలకు కూడా ఇదే వర్తిస్తుంది. 

దేవుణ్ణి మనస్ఫూర్తిగా నమ్మాలి. హృదయపూర్వకంగా ప్రార్థించాలి. నిస్సందేహంగా ఆయనపై ఆధారపడాలి. తన సంకల్పం మేరకు మన ప్రార్థనలు ఫలించేలా ఆయన చేస్తాడు. ప్రతిదీ దైవ సంకల్పమేననీ, మన ప్రార్థనలను ఆయన ఆలకిస్తాడనీ, మనకు యోగ్యమైనదాన్ని ఆయన ప్రసాదిస్తాడనీ నమ్మిననాడు... మన మంచి ఆలోచనలన్నీ నెరవేరుతాయి. మన చేసిన సత్కార్యాలు మంచి ఫలితాలను ఇస్తాయి.


Updated Date - 2021-07-16T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising