ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యామోహంతో నాశనం తప్పదు

ABN, First Publish Date - 2021-02-19T08:39:37+05:30

ఎంత బలశాలి అయినా బలహీనత కారణంగా గోతిలో పడతాడు. ఈ విషయాన్ని మారద వెంకయ్య రాసిన భాస్కర శతకంలోని ఓ పద్యం ద్వారా తెలుసుకుందాం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎంత బలశాలి అయినా బలహీనత కారణంగా గోతిలో పడతాడు. ఈ విషయాన్ని మారద వెంకయ్య రాసిన భాస్కర శతకంలోని ఓ పద్యం ద్వారా తెలుసుకుందాం.


ఉరుబలశాలనంచుదనునొల్లని యన్య పతివ్రతాంగనా

సురతము గోరునేని కడ సుమ్మది భూతికి బ్రాణహానియౌ

శిరములుగూల రాఘవునిచే దశకంఠుడు గ్రుంగిపోవడే

యెఱుగక సీతకనపడి యిష్టు భృత్యుల గూడి భాస్కరా


రావణాసురుడు, హిరణ్యకశిపుడు జీవితంలో దెబ్బతినలేదా? భయంకరమైన యుద్ధంలో చనిపోలేదా? ఎంత బలమున్న వాడైనా సరే, వ్యామోహం వల్ల ఘోరంగా దెబ్బతింటాడు. సీత వెనకాల పడిన రావణాసురుడు రాముడి చేతిలో నేలకూలాడు. లైంగిక ఆరోపణల కారణంగా ఎంత మంది పెద్ద పెద్ద వాళ్లు పదవులు కోల్పోయారో, ఎంతో మంది అప్రతిష్ట మూటగట్టుకున్నారో చూస్తూనే ఉన్నాం కదా! ఆధునిక జీవితంలో ఇష్టం లేకపోయినా బలవంతం చేసే సంఘటనలు ఎక్కువయ్యాయి. అత్యాచారాలు, యాసిడ్‌ దాడులు ఆ కోవకు చెందినవే. అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు విరుగుడుగా ఈ పద్యం పనికొస్తుంది. 



గరికిపాటి నరసింహారావు

Updated Date - 2021-02-19T08:39:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising