ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరుణ అంటే...

ABN, First Publish Date - 2021-12-31T05:39:03+05:30

బౌద్ధ సిద్ధాంతానికి మూలస్తంభం కరుణ. దయారసానికి ఉన్న అనేక పేర్లలో ‘కరుణ’ ఒకటి. ‘కరుణైవ కారుణ్యం’ అంటారు. కరుణయే కారుణ్యం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బౌద్ధ సిద్ధాంతానికి మూలస్తంభం కరుణ. దయారసానికి ఉన్న అనేక పేర్లలో ‘కరుణ’ ఒకటి. ‘కరుణైవ కారుణ్యం’ అంటారు. కరుణయే కారుణ్యం. తనను తాను ఆధీనం చేసుకోవడమే కరుణ. మనస్సును లేదా హృదయాన్ని ద్రవింపజేసేది కరుణ. బౌద్ధం అనే రథానికి ప్రజ్ఞ, కరుణ అనేవి రెండు చక్రాలు. నాలుగు బ్రహ్మవిహారాలలో కరుణ ఒకటి. అది అతి ముఖ్యమైనది. ఈ కరుణతత్త్వాన్ని ఆలంబనగా చేసుకొనే మహాయాన బౌద్ధం ప్రపంచవ్యాప్తం అయింది. ఒక విధంగా కరుణ కూడా ప్రేమ తత్త్వమే. కానీ ప్రేమ వేరు, కరుణ వేరు. ప్రేమలో ప్రేమతో పాటు పగ కూడా ఉంటుంది. తనను ప్రేమించని ద్వేషించే రూపంలోకి ప్రేమ మారిపోతుంది.


లేదా తననుతాను ద్వేషించుకుంటుంది. అంటే ప్రేమకు హద్దులు ఉంటాయి. లాభనష్టాలు కూడా ఉంటాయి. ప్రేమించేవారినే కాదు, ద్వేషించేవారిని కూడా ప్రేమించడమే కరుణ. స్వార్థం లేని దయాగుణం అన్నమాట. అంటే ఇతరుల సంక్షేమాన్ని కేంద్రంగా చేసుకొని విస్తరించేది కరుణ. లాభనష్టాలతో, ఇష్టానిష్టాలతో, జాతి బేధాలు, జీవజాతుల బేధాలు చూపకుండా... సమస్త జీవ, అజీవకోటిపై చూపించే దయాగుణమే కరుణ. ఆ కరుణకు ప్రతిరూపమే బౌద్ధంలోని అవలోకితేశ్వరుడు.

Updated Date - 2021-12-31T05:39:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising