ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపవాసాలు ఎందుకంటే...

ABN, First Publish Date - 2021-04-16T05:30:00+05:30

అరబిక్‌ భాషలో ‘రమ్జ్‌’ అంటే ‘కాలడం’ అని అర్థం. రంజాన్‌ మాసంలోని అన్ని రోజూలూ ఉపవాస దీక్ష ద్వారా శరీరాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అరబిక్‌ భాషలో ‘రమ్జ్‌’ అంటే ‘కాలడం’ అని అర్థం. రంజాన్‌ మాసంలోని అన్ని రోజూలూ ఉపవాస దీక్ష ద్వారా శరీరాన్ని శుష్కింపజేసుకుంటే... ఆత్మ ప్రక్షాళన అవుతుంది. తద్వారా పాపాలన్నీ సమసిపోతాయి. అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అదుపులో ఉంటాయి. మనోనిగ్రహం ఏర్పడుతుంది. మానవుల్లో ప్రేమాభిమానాలు, క్రమశిక్షణ, కర్తవ్య పరాయణత్వం, సహనం, దాతృత్వం, పవిత్ర జీవనం, న్యాయమార్గానుసరణం, ఆర్థిక సమానత్వం, సర్వ మానవ సౌభ్రాతృత్వం లాంటి ఉత్తమ గుణాలు పెంపొందడం కోసం రంజాన్‌ మాసాన్ని అల్లాహ్‌ ప్రసాదించాడు.



మనిషి తనను తాను ఎలా నియంత్రించుకోవాలో, కోరికలకు బానిస కాకుండా, మనో వాంఛలకు లొంగకుండా ఎలా ఉండాలో ఉపవాసం తెలియజేస్తుంది. ఆలోచనల పైనా, ఆచరణ పైనా పట్టు సాధించడంలో స్వీయ నియంత్రణ ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇంద్రియాలు మనిషి అదుపులో ఉండేలా చేయడమే ఉపవాసాల లక్ష్యం. ఉపవాసాలతో మనిషిలో ఆత్మనిగ్రహం ఏర్పడుతుంది. సాధారణంగా మనిషి కోరికలకు బానిసైపోతూ ఉంటాడు. అతణ్ణి దైవానికి పూర్తి దాసునిగా మలచడానికి ఉపవాసాలు దోహదపడతాయి. ఉపవాస సమయంలోనూ మనిషిలో కోరికలు జనించవచ్చు. కానీ అతను వాటి మీద నైతికమైన ఆధిక్యాన్ని సాధిస్తాడు. కోరికలను అదుపులో ఉంచుకోవడం అతనికి అలవాటవుతుంది. వ్యసనాల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతాడు. ఇది అతని ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. 




ఇక, ఆకలిదప్పులు ఎలా ఉంటాయో ఉపవాస కాలంలో అర్థమవుతుంది. ఆహారానికి ఉన్న ప్రాధాన్యం తెలుస్తుంది. ‘మనం రోజూ మూడు పూటలా భోజనం చేస్తున్నాం, ఎక్కువైతే చెత్త కుప్పల మీద పారేస్తున్నాం! అదే అన్నం దొరకని బీదవాడు ఎలా పస్తులు ఉంటున్నాడో?’ అనే ఆలోచన కలుగుతుంది. ఆకలి బాధపై అవగాహన ఏర్పడుతుంది. సమాజం పట్ల తన బాధ్యత ఏమిటో తెలుస్తుంది. ఇతరులకు సాయపడే గుణం అలవడుతుంది. దీనివల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. 



క్రమశిక్షణకూ, క్రమబద్ధమైన జీవితానికీ, అలవాటు పడడానికి, సహనం పెరగడానికీ, ఆత్మపరిశీలన చేసుకోవడానికీ ఉపవాసాలు దోహదం చేస్తాయి. చేసిన ప్రతి పనికీ అల్లాహ్‌ ఎదుట జవాబు చెప్పుకోవలసి ఉంటుందనే భావన చెడు కార్యాల వైపు వెళ్ళకుండా చేస్తుంది. దైవానికి మరింత చేరువయ్యేలా చేస్తుంది. కఠోరమైన ఉపవాస దీక్ష చేపట్టడం ద్వారా దైవం ఆదేశాలను పాటిస్తూ, ఆయన మనల్ని ప్రతి క్షణం గమనిస్తున్నాడనే ఆలోచనతో జీవనం సాగించినప్పుడు... దైవంతో బంధం మరింత పటిష్ఠం అవుతుంది. భయభక్తులతో జీవనాన్ని సాగించడం వల్ల దైవాగ్రహం నుంచి తప్పించుకోగలం.


అలాంటి భయభక్తులు జనించడానికే రంజాన్‌ మాసంలో ఉపవాసాలను తప్పనిసరిగా పాటించాల్సిన విధిగా అల్లాహ్‌ ఏర్పరిచాడు. ఉపవాసం విరమించే సమయంలో ‘‘నేను చేసిన ఉపవాసం నాలో దైవభీతి కలిగించిందా? నరకాగ్ని నుంచి నన్ను కాపాడే విధంగా ఉందా? అల్లాహ్‌ మెచ్చుకొనేలా, ఆయన సూచించినట్టు ఈ ఉపవాసాన్ని నేను పాటించానా?’’ అని ప్రతి ఒక్కరూ ఆత్మవిమర్శ చేసుకోవాలి. 

 మహమ్మద్‌ వహీదుద్దీన్‌


Updated Date - 2021-04-16T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising