ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సౌందర్యానికి వేప!

ABN, First Publish Date - 2021-04-05T05:26:41+05:30

వేపాకు నీళ్లు మొటిమలు, మచ్చలను పోగొడతాయి. బ్లాక్‌ హెడ్స్‌ను దూరం చేస్తాయి. అరలీటరు నీళ్లల్లో గుప్పెడు వేపాకులు వేసి మరిగించాలి. నీళ్లు ఆకుపచ్చ రంగులోకి మారాక స్టవ్‌పై నుంచి దింపుకొని చల్లా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేపాకు నీళ్లు మొటిమలు, మచ్చలను పోగొడతాయి. బ్లాక్‌ హెడ్స్‌ను దూరం చేస్తాయి. అరలీటరు నీళ్లల్లో గుప్పెడు వేపాకులు వేసి మరిగించాలి. నీళ్లు ఆకుపచ్చ రంగులోకి మారాక స్టవ్‌పై నుంచి దింపుకొని  చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఆ నీటిని వడగట్టి సీసాలో పోసి ఫ్రిజ్‌లో భద్రపరచాలి. రోజూ అందులోంచి కొద్దిగా వేపనీటిని తీసుకుని అందులో దూదిని ముంచి ముఖానికి మసాజ్‌లా సున్నితంగా రాసుకుని కాసేపయ్యాక కడిగేసుకోవాలి. ఇలా కొన్ని రోజులు చేస్తే ముఖంపై ఏర్పడ్డ మొటిమలు, మచ్చలు పోతాయి.


  • పొడిచర్మం ఉన్న వారికి వేప పొడి మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. వేపాకు పొడిలో కొద్దిగా నీళ్లు, కొద్దిగా ద్రాక్ష గింజల నూనె కలిపి పేస్టులా చేసి ముఖానికి రాసుకోవాలి. కాసేపైన తర్వాత నీళ్లతో కడిగేసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది.

  • కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడితే వాటికి వేపపొడిలో కాస్త నీళ్లు పోసి పేస్టులా చేసి దాన్ని కళ్ల చుట్టూ రాసుకుని పదిహేను నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది. 

  • చుండ్రుతో ఇబ్బంది పడుతున్న వాళ్లు షాంపూతో తలరుద్దుకున్న తర్వాత వేపాకులు వేసి మరిగించిన వేడినీళ్లను జుట్టుకు రాసుకుని కాసేపయ్యాక శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా చేస్తే చుండ్రు పోతుంది. వేపాకు పొడిలో నీళ్లు కలిపి పేస్టులా చేసి దాన్ని తలకు పట్టించి అరగంట తరువాత కడిగేసుకుంటే చుండ్రు బాధ పోతుంది.

Updated Date - 2021-04-05T05:26:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising