ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాదాల పగుళ్లు పోతాయిలా!

ABN, First Publish Date - 2021-09-19T05:30:00+05:30

పాదాల పగుళ్ల సమస్య చాలామందిని ఇబ్బంది పెడుతుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాదాల పగుళ్ల సమస్య చాలామందిని ఇబ్బంది పెడుతుంది. అయితే ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. ఏం చేయాలంటే...

రాత్రి పడుకునే ముందు పాదాళ్లను శుభ్రంగా కడిగి పొడి గుడ్డతో తుడవాలి. తరువాత విక్స్‌ వాపోరబ్‌ను ఒక లేయర్‌లా రాయాలి. ఐదు నిమిషాల పాటు మసాజ్‌ చేసుకోవాలి. తరువాత కాటన్‌ సాక్స్‌ ధరించి పడుకోవాలి. ఉదయాన గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. రోజూ ఈ చిట్కాను ఫాలో కావచ్చు.


ఒక టబ్‌లో గోరువెచ్చటి నీళ్లు తీసుకుని ఇరవై నిమిషాల పాటు పాదాలను పెట్టాలి. తరువాత పాదాలు ఆరనివ్వాలి. ఇప్పుడు ఒక టీస్పూన్‌ వాజ్‌లైన్‌, మూడు నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి పాదాల పగుళ్లు ఉన్న చోట రాయాలి. ఉలన్‌ సాక్స్‌లు ధరించి పడుకోవాలి. ఉదయాన్నే గోరువెచ్చటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. రోజూ పడుకునే ముందు ఇది ఫాలో అయితే పాదాల పగుళ్లు దూరమవుతాయి. 


పాదాలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. తరువాత అరటిపండును గుజ్జుగా చేసి పాదాలపై నెమ్మదిగా మసాజ్‌ చేయాలి. ఇరవై నిమిషాల పాటు వదిలేసి తరువాత నీళ్లతో కడిగేసుకోవాలి. ప్రతిరోజు ఇలాచేస్తే రెండు వారాల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది. అరటిపండు సహజసిద్ధమైన స్కిన్‌ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.

Updated Date - 2021-09-19T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising