ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎలర్జీ సమస్యకు మాస్క్‌!

ABN, First Publish Date - 2021-04-07T05:30:00+05:30

వస్త్రంతో చేసిన మాస్క్‌ అయినా సర్జికల్‌ మాస్క్‌ అయినా వైరస్‌ అణువుల నుంచి మనకు రక్షణనిస్తాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వస్త్రంతో చేసిన మాస్క్‌ అయినా సర్జికల్‌ మాస్క్‌ అయినా వైరస్‌ అణువుల నుంచి మనకు రక్షణనిస్తాయి. అంతేకాదు సాధారణ ఎలర్జీ కారకాలను నిలువరించడంలో కూడా మాస్క్‌లు బాగా పనిచేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. తరచూ ఎలర్జీకి గురయ్యే వారిలో మాస్క్‌ ధరించడం వల్ల ఎలర్జీ లక్షణాలు ఏ స్థాయిలో ఉంటాయో తెలుసుకునేందుకు  ఇజ్రాయేల్‌కు చెందిన కొందరు పరిశోధకులు ఒక అధ్యయనం చేశారు.


‘‘సర్జికల్‌ మాస్క్‌ లేదా ఎన్‌95 మాస్క్‌ ధరించిన 215 మంది నర్సులను రెండు వారాల పాటు పరిశీలించారు. వీరిలో 44మందిలో ఎలర్జీ లక్షణాలు తీవ్రంగా ఉండడం, దాదాపు 44శాతం మందిలో ముక్కుకారడం, తుమ్ములు, ముక్కుదిబ్బడ వంటివి తక్కువగా కనిపించాయట. ఎలర్జీ లక్షణాలు తక్కువగా ఉన్న 91 మందికి సర్జికల్‌ మాస్క్‌ ఇస్తే వీరిలో 30శాతం మంది పరిస్థితి మెరుగయ్యింది. ఎన్‌95 మాస్క్‌ ధరింపజేస్తే నలభై శాతం మందిలో ఎలర్జీ తగ్గింది’’అని చెబుతున్నారు అమియెల్‌ డ్రార్‌ అనే పరిశోధకుడు. 



ఎలర్జీ ఉన్నవారు మాస్క్‌లు ఎలా ధరించాలంటే...

ఫ కళ్లకు సబంధించి ఎలర్జీ సమస్య ఉన్నవారు బయటకు వెళ్లినప్పుడు సాధారణ కళ్లజోడు లేదా సన్‌గ్లాసెస్‌ తప్పనిసరిగా పెట్టుకోవాలి. దీంతో గాలిలో కలిసిపోయిన పూల నుంచి వెలువడే పరాగరేణువుల నుంచి కళ్లకు రక్షణ లభిస్తుంది.   


 బయటకు వెళ్లి వచ్చిన తరువాత వెంటనే మాస్క్‌ను శుభ్రంగా ఉతకాలి. ఇలా చేస్తే మాస్క్‌లో చిక్కుకున్న దుమ్ముకణాలు, ఎలర్జీ కారకాలు చర్మానికి అంటుకోవు. 


 దురద కలిగించని మాస్క్‌లనే ధరించాలి. సున్నితమైన చర్మం ఉన్నవారు మాస్క్‌లను ఉతికేందుకు పర్‌ఫ్యూమ్‌ రహిత సబ్బులను ఉపయోగించాలి. సర్జికల్‌ మాస్క్‌ అయితే దురద కలిగించదు.


Updated Date - 2021-04-07T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising