ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోషకాహార లోపం ఇలా దూరం!

ABN, First Publish Date - 2021-07-20T04:38:31+05:30

శాకాహారుల్లో పోషకాహార లోపం తలెత్తే అవకాశాలు ఎక్కువ. నాడుల ఆరోగ్యానికి కీలకమైన విటమిన్‌ బి12 లోపాన్ని సప్లిమెంట్లతో అధిగమిస్తూ, పరిపూర్ణ ఆరోగ్యానికి అవసరమైన అదనపు పోషకాలను ఆహారంలో చేర్చుకోవాలి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శాకాహారుల్లో పోషకాహార లోపం తలెత్తే అవకాశాలు ఎక్కువ. నాడుల ఆరోగ్యానికి కీలకమైన విటమిన్‌ బి12 లోపాన్ని సప్లిమెంట్లతో అధిగమిస్తూ, పరిపూర్ణ ఆరోగ్యానికి అవసరమైన అదనపు పోషకాలను ఆహారంలో చేర్చుకోవాలి.


విటమిన్‌ బి12 దొరికే పదార్థాలు: అనీమియా, అటాక్సియా, జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలతో కూడిన విటమిన్‌ బి12 లోపాన్ని అధిగమించడం కోసం మల్లీవిటమిన్లు, ఐరన్‌, మెగ్నీషియం, పీచు అధికంగా ఉండే సోయా బీన్స్‌, బాదం పాలు, మష్రూమ్స్‌, అవకాడొలను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.


ఐరన్‌ పుష్కలంగా: రక్తవృద్ధికి, హీమోగ్లోబిన్‌, మయోగ్లోబిన్‌ తయారీకి ఐరన్‌ అవసరం. చిక్కుళ్లు, పప్పుదినుసుల ద్వారా ఈ పోషకాలను భర్తీ చేసుకోవచ్చు. వీటిలో ఉండే ఐరన్‌, ఫోలేట్‌, మెగ్నీషియం, పొటాషియంలను శరీరం శోషించుకోవాలంటే తప్పనిసరిగా సి విటమిన్‌ కలిగి ఉండే సిట్రస్‌ పండ్లు, కూరగాయలు తీసుకోవాలి.


నట్స్‌, సీడ్స్‌: సబ్జా, పొద్దుతిరుగుడు, ఫ్లాక్స్‌, పుచ్చ, గుమ్మడి విత్తనాల్లో మోనోశాచురేటెడ్‌ ఫ్యాట్స్‌, కొవ్వులు, విటమిన్లు, పీచు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి పోషకాహార లోపాలను నివారిస్తాయి.


ఆకుకూరలు: ప్రొటీన్‌, డైటరీ ఫైబర్‌, విటమిన్‌ ఎ, కె, సి, కెరోటినాయిడ్లు, ఫోలేట్‌, మాంగనీసు వీటిలో ఉంటాయి. ఇవి రక్తలేమి, పోషకాహార లోపాలను నివారిస్తాయి. పాలకూర, బ్రొకొలి, ఆకుపచ్చని కూరగాయలతో ఎముకలు బలపడడంతో పాటు వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది.

Updated Date - 2021-07-20T04:38:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising