ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంట్లోనే మట్టి గణపతి!

ABN, First Publish Date - 2021-09-09T05:30:00+05:30

ఇంట్లోనే మట్టి గణపతి చేసేయండి ఇలా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి

బంకమట్టి, నీళ్లు, టూత్‌పిక్స్‌, కత్తి, ఆర్గానిక్‌ కలర్స్‌


ఇలా చేయాలి...

  1. మట్టిలో కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. నీళ్లు ఎక్కువ పోయకూడదు. మట్టి బాగా మెత్తగా కాకుండా చూసుకోవాలి.
  2. ఇప్పుడు ప్రతిమను తయారీకి అవసరమైన భాగాలుగా మట్టిని విభజించుకోవాలి. పొట్ట, తల, చెవులు, తొండం, ముఖం, కాళ్లు, చేతులు, దంతాలకు సరిపడా మట్టిని విడగొట్టాలి.
  3. ప్రతిమను కూర్చోబెట్టడానికి అనువుగా బేస్‌ భాగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దీనిపై పొట్ట భాగం పెట్టాలి. తరువాత కాళ్లు రెండు అతికించాలి. కొద్దిగా తడి అద్దుతూ అతికించవచ్చు లేదా టూత్‌పిక్స్‌తో జాయింట్‌ చేయవచ్చు.
  4. అలాగే పొట్టపైన తలభాగం, చేతులు అతికించాలి. కుడి చెయ్యి ఆశీర్వదిస్తున్నట్టుగా పెట్టాలి. ఎడమ చెయ్యిలో లడ్డూ(చిన్న మట్టి ముద్ద) పెట్టాలి. తరువాత చెవులు, తొండం అంటించాలి. టూత్‌పిక్‌లను దంతాలుగా పెట్టాలి.
  5. ఇప్పుడు కాస్త మట్టిని తీసుకుని కళ్లలా అంటించాలి. కిరీటం చేసి పెట్టాలి. 
  6. వినాయకుడు కలర్‌ఫుల్‌గా ఉండాలనుకుంటే ఆర్గానిక్‌ కలర్స్‌ వేసుకోవాలి. అంతే... మట్టి గణపతి రెడీ.


Updated Date - 2021-09-09T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising