ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహారాస్నాదికాడ

ABN, First Publish Date - 2021-02-16T08:48:49+05:30

ఆయుర్వేద వైద్యశాస్త్రంలో వాతరోగ చికిత్సకు ప్రాచుర్యంలో ఉన్న ఔషధాలలో మహారాస్నాదికాడ ఒకటి. దీని తయారీ, ఉపయోగాల గురించి ఆయుర్వేద శాస్త్రగ్రంథమైన శార్గ్జధర సంహితలోని మధ్యమకాండలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆయుర్వేద వైద్యశాస్త్రంలో వాతరోగ చికిత్సకు ప్రాచుర్యంలో ఉన్న ఔషధాలలో మహారాస్నాదికాడ ఒకటి. దీని తయారీ, ఉపయోగాల గురించి ఆయుర్వేద శాస్త్రగ్రంథమైన శార్గ్జధర సంహితలోని మధ్యమకాండలో వివరించడం జరిగింది. మహారాస్నాదికాడలో ముఖ్య మూలిక దుంపరాష్ట్రము. దీనికి సంస్కృతంలో మహాబలి రాస్న అనే పేరు కూడా ఉంది. ఇది పసుపు ముక్కలా ఉండి, దుంప సువాసన కలిగి ఉంటుంది. కాబట్టి ఔషధాలలో దుంపనే వాడతారు. మహారాస్నాదికాడ తయారీలో దుంప రాష్ట్రముతో పాటు దురదగొండి, ఆముదపు వేళ్లు, దేవదారు బెరడు, వస, అడ్డసరంపు ఆకు, తుంగ, తెల్లగలిజేరు, తిప్పతీగ, పల్లేరు, రేలకాయ గుజ్జు, పిప్పళ్లు, చిన్నములక మొదలైన 30 రకాల మూలికలతో కలిపి కషాయంగా తయారుచేస్తారు. 


మహారాస్నాదికాడను పలురకాల వాతరోగాల చికిత్సలో ఉపయోగిస్తారు. సర్వాంగ కంప వాతము, గూని వాతము, పక్షవాతము, నడుము మొదలు కాళ్ల వరకూ బాధను కలుగజేసే గృద్రసీవాతము మొదలైన పది రకాల వాతాలకు విశేషంగా పనిచేస్తుంది. మోకాళ్ల నొప్పి నుంచి ఉపశమనానికి మహారాస్నాదికాడ అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. గర్భఽధారణ సమస్యను సరిచేయడానికి అనుపానంగా దీన్ని వాడడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు.

ఉపయోగించే మోతాదు: పెద్దలు 10 మిల్లీ లీటర్లు, పిల్లలు 5 మిల్లీ లీటర్ల చొప్పున ఉదయం, సాయంత్రం లేదా వైద్యుల సూచనమేరకు తీసుకోవలెను. ప్రస్తుతం ధూద్‌పాపేశ్వర్‌, జైధ్యనాధ్‌, వైద్యరత్న వంటి ఆయుర్వేద మందుల సంస్థలు దీన్ని తయారుచేస్తున్నాయి.


శశిధర్‌, 

అనువంశిక ఆయుర్వేద వైద్య నిపుణులు,

సనాతన జీవన్‌ ట్రస్ట్‌, కొత్తపేట్‌, చీరాల.

Updated Date - 2021-02-16T08:48:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising