ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహా పంచగవ్య ఘృతం

ABN, First Publish Date - 2021-03-09T05:38:13+05:30

భారతీయ ఆయుర్వేద వైద్యశాస్త్రంలో విశేషంగా ఉపయోగించే ఔషధాలలో మహా పంచగవ్యఘృతం ఒకటి. దీనిని బృహత్‌ పంచగవ్య త్రం అని కూడా అంటారు. మహా పంచగవ్య ఘృతాన్ని ఆవు పంచకంతో కలిపి తయారు చేస్తారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారతీయ ఆయుర్వేద వైద్యశాస్త్రంలో విశేషంగా ఉపయోగించే ఔషధాలలో మహా పంచగవ్యఘృతం ఒకటి. దీనిని బృహత్‌ పంచగవ్య త్రం అని కూడా అంటారు. మహా పంచగవ్య ఘృతాన్ని ఆవు పంచకంతో కలిపి తయారు చేస్తారు. దీని తయారీ, ఉపయోగాల గురించి చక్రదత్త భషజ్యరత్నావళి వంటి ఆయుర్వేద శాస్త్ర గ్రంథాలలో వివరంగా ఉంది. 


మహా పంచగవ్యఘృతంలో ముఖ్యంగా ఉండేది గోపంచకం. దీని తయారీలో ముందుగా దశ మూలాలు, త్రిఫలములు, పసుపు, ఉత్తరేణి వేళ్ళు, నీలి, పుష్కరమూలం వంటి 23 మూలికలు కలిపి కషాయం కాచుతారు. వాటిని ఆవు పాలు, పెరుగు, నెయ్యి, ఆవు పంచకం, ఆవు పేడతో కలిపి కాచి తయారుచేస్తారు. 


ఈ మహా పంచగవ్యఘృతం క్రమం తప్పకుండా తీసుకుంటే అపస్మారం, జ్వరాలు, దగ్గులు, ఉదర రోగాలు, మూల రోగాలు, పాండు రోగాలు, కామెర్లు వంటి జబ్బుల నుంచి ఉపశమం పొందవచ్చు. పంచ మహాగవ్యఘృతాన్ని ఓషధీ ప్రకాశ్‌ (సనాతతన జీవన్‌ ట్రస్ట్‌), వైద్యరత్న, ఖిూఅ, కొట్టక్కల్‌ వంటి ఆయుర్వేద సంస్థలు తయారు చేస్తున్నాయి. 


ఉపయోగించే మోతాదు: 5గ్రాములు. ఉదయం, సాయంత్రం పాలు అనుపానంగా తీసుకోవాలి. లేదా వైద్యుల సూచన ప్రకారం వాడాలి. 

శశిధర్‌ అనువంశిక ఆయుర్వేద వైద్య నిపుణులు సనాతన జీవన్‌ ట్రస్ట్‌ కొత్తపేట, చీరాల-523157, ఫోన్‌ నం. 08594-237666

Updated Date - 2021-03-09T05:38:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising