ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాంజ్‌వేర్‌

ABN, First Publish Date - 2021-06-16T05:44:21+05:30

‘ఆక్స్‌ఫర్డ్‌ ఇంగ్లిష్‌ డిక్షనరీ’ 2020లో ‘వర్డ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ కనుగొనడం మేధావి వర్గానికి బహుశా కష్టమై ఉండొచ్చు. ఎందుకంటే ఈ కరోనా కాలంలో కొత్తగా పుట్టుకొచ్చి, జనం నోట్లో నానిన పదాలెన్నో! కానీ ఫ్యాషన్‌కు సంబంధించిన పదమేదైనా ప్రకటించాలనుకొంటే ఆ ఘనత ‘స్వెట్‌ప్యాంట్స్‌’కు మాత్రమే దక్కుతుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ఆక్స్‌ఫర్డ్‌ ఇంగ్లిష్‌ డిక్షనరీ’ 2020లో ‘వర్డ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ కనుగొనడం మేధావి వర్గానికి బహుశా కష్టమై ఉండొచ్చు. ఎందుకంటే ఈ కరోనా కాలంలో కొత్తగా పుట్టుకొచ్చి, జనం నోట్లో నానిన పదాలెన్నో! కానీ ఫ్యాషన్‌కు సంబంధించిన పదమేదైనా ప్రకటించాలనుకొంటే ఆ ఘనత ‘స్వెట్‌ప్యాంట్స్‌’కు మాత్రమే దక్కుతుంది. సెకండ్‌వేవ్‌లో దేశమంతా లాక్‌డౌన్ల పర్వం నడుస్తున్న క్రమంలో చమటను పీల్చి, సౌకర్యంగా ఉండే జాగర్స్‌ వాడకం అధికమైంది. సామాన్యుల నుంచి హాలీవుడ్‌ సెలబ్రిటీల వరకు ఇదే ట్రెండ్‌. ముఖ్యంగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సాధారణమైపోవడంతో లాంజ్‌వేర్స్‌ మార్కెట్‌ మునుపెన్నడూ లేనంతగా ఊపందుకుంది. రాబోయే రోజుల్లో వీటి డిమాండ్‌ మరింత పెరుగుతుందన్నది కంపెనీలు అంచనా.




అందుకే బడా బడా బ్రాండ్స్‌ అన్నీ లాంజ్‌వేర్స్‌ డిజైనింగ్‌లో బిజీ అయిపోయాయి. ఇంట్లోనే కాదు... లాక్‌డౌన్ల మధ్యలో అప్పుడప్పుడూ బయటకు వెళ్లినా ఈ తరహా సూట్‌లకే జనం ప్రాధాన్యం ఇస్తున్నారు. ధరిస్తే సౌకర్యంగా, హాయిగా ఉండే ట్రాక్‌సూట్స్‌, స్పోర్ట్స్‌వేర్‌లు కూడా ఇందులో భాగమైపోయాయి. ఇంట్లో ఆఫీస్‌ పని చేస్తున్నా, జూమ్‌ మీటింగ్‌ల్లో పాల్గొనాలన్నా, లాక్‌డౌన్‌ సడలింపుల్లో ఓ గంట అలా బయటకు వెళ్లి రావాలన్నా అందరి ఛాయిస్‌ లాంజ్‌వేరేనంటున్నారు ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్‌ ‘జ్యూసీ కౌచర్‌’. ఈ ఫొటోలు అవే. లాంజ్‌వేర్‌లో రియాలిటీ షోల ముద్దుగుమ్మ కిమ్‌ కర్దాషియన్‌, మోడల్స్‌! 

Updated Date - 2021-06-16T05:44:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising