ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎదురు చూసెనోయ్‌ గోపికా

ABN, First Publish Date - 2021-08-04T06:11:44+05:30

అమ్మమ్మ నుంచి ఫోన్‌... ఊరు రమ్మని. అమ్మా నాన్నతో కలిసి అక్కడికి వెళుతుంది సరయూ. పచ్చదనం నిండిన ఊళ్లో కారు దిగిన తను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మ్మమ్మ నుంచి ఫోన్‌... ఊరు రమ్మని. అమ్మా నాన్నతో కలిసి అక్కడికి వెళుతుంది సరయూ. పచ్చదనం నిండిన ఊళ్లో కారు దిగిన తను... ఆహ్లాదమైన ఆ వాతావరణానికి ముగ్ధురాలైపోతుంది. ‘గూటిలో దాగిన ఓ గువ్వా... నేడు నీ కోటకు నువ్వొచ్చావా... వస్తూ వస్తూ నీతోపాటు సరదాలు తీసుకొచ్చావా...’ బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తున్న మధుర గీతం ఆ కాసేపూ మరో లోకంలోకి తీసుకెళుతుంది. ప్రకృతి సోయగాలు... పల్లె అందాలు... పాట సాగినంతసేపూ ప్రతి ఫ్రేమ్‌లో పరవశానికి లోనవుతాం. 


ఒక రోజు ఉదయం వాకింగ్‌కు వెళుతుంది సరయూ. అదే సమయంలో ఓ కుర్రాడు జాగింగ్‌ చేస్తూ ఆమె కంట పడతాడు. కానీ ఆమెను గమనించడు. తను మాత్రం అతడినే చూస్తుంటుంది. అలా చూస్తున్నంతసేపూ ఆమె కళ్లలో ఏదో తెలియని ఆనందం. తరువాతి రోజు... పార్క్‌లో అతడికి తెలియకుండా అతడి వెంటే పరిగెడుతుంది తను. మాట కలపాలని ప్రయత్నిస్తుంది. కానీ వద్దని సర్దిచెప్పుకుంటుంది. రాత్రింబవళ్లూ అతడి ధ్యాసే తనకు. ఒక రోజు ఉదయం పార్క్‌కు వెళితే అతడు ఎంతకీ రాడు. ఆమెలో ఆందోళన. ‘ఏమై ఉంటుంది?’... కంగారు. అమ్మమ్మ ఊరి నుంచి తిరిగి ఇంటికి వెళుతుంది. ఆమె కళ్లల్లో బాధ. ఇంటికి వెళ్లినా అతడి తలపులే వెంటాడుతుంటాయి. 


మరో ఉదయం... మబ్బు తెరలు చీల్చుకొంటూ భానుడి లేలేత కిరణాలు నేలపై వాలుతుంటాయి. పార్క్‌లో బల్లపై పరధ్యానంగా కూర్చున్న సరయూ ముందు అతడు ప్రత్యక్షమవుతాడు. తన కళ్లను తానే నమ్మలేకపోతుంది తను. కలా... నిజమా? ఎగసిపడుతున్న కెరటంలా ఆమెలో అంతులేని ఆనందం. ‘‘మనం మాట్లాడే మాటలో ఎంతోకొంత అబద్దం ఉండవచ్చేమో కానీ, చూసే చూపులో మాత్రం అబద్దం ఉండదు. కానీ నువ్వు మాట్లాడే మాటలోనూ, చూసే చూపులోనూ, చూపించే ప్రేమలోనూ నిజాయతీ ఉంది’’... తన కళ్లలోకి చూస్తూ చెబుతాడు. ‘అయినా నువ్వంటే నాకు ఇష్టమని నీకెలా తెలిసింది’... తన సందేహం. ‘ఎలానా..? ఇలా...’ అంటూ సరయూ అమ్మమ్మ గారి ఊళ్లో తనతో మాట కలపాలని పడిన తపన గుర్తు చేస్తాడు అతడు. ‘నీ గురించి ఎవరో చెబితే తెలుసుకోవాలనుకోలేదు. నువ్వు చెబితేనే తెలుసుకోవాలనుకున్నాను. అయినా నేను ఎవరితోనైనా మాట్లాడాలనుకొంటే తెలియనివాళ్లయినా సరే... చాలా క్యాజువల్‌గా మాట్లాడేస్తాను. 


కానీ నీ దగ్గరికి వచ్చేసరికి... చూడాలనుకొంటే చూడలేను. మాట్లాడాలనుకొంటే మాటలే రావు. ఒక్కటి మాత్రం నిజం... నీ కోసం ఎంతో ఎదురుచూశాను’... అతడి ముందు తన మనసు విప్పుతుంది సరయూ. ‘అయితే అంతలా ఎదురుచూశావు కదా. అక్కడికే పద... నా పేరు చెబుతాను’... అంటాడతడు. ఈసారి చెప్పకుండానే అమ్మమ్మ ఊరు వెళుతుంది సరయూ. మొదట ఎక్కడ అతడిని చూసిందో అక్కడే కలుస్తారు ఇద్దరూ. ‘ఇంతకీ నీ పేరు చెప్పలేదు’... అడుగుతుంది. ‘మురళీ కృష్ణా’..! ‘గోపికా సరయూ’... ఒకరికి ఒకరు పరిచయం చేసుకొంటారు. ఈ అందమైన ప్రేమ కథ పేరు ‘ఎదురు చూసెనోయ్‌ గోపిక’. సరయూ, మురళీల మధ్య పట్టుమని పది డైలాగ్‌లు కూడా లేకుండా చక్కని స్ర్కీన్‌ప్లేతో కథని నడిపించాడు దర్శకుడు ప్రేమ్‌ రవిచందు. భరత్‌, భ్రమరాంబికలు అద్భుతమైన అభినయంతో ప్రతి సన్నివేశాన్నీ పండించారు. కరుణాకర్‌ కెమెరా మరో స్థాయిలో ఉంటుంది. యూట్యూబ్‌లో విడుదలైన ఈ లఘుచిత్రాన్ని ఇప్పటికి ఆరున్నర లక్షల మందికి పైగా వీక్షించారు. 

Updated Date - 2021-08-04T06:11:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising