ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏడేళ్ల చిన్నారికి.. ప్రపంచ శాంతి ఫొటో పురస్కారం

ABN, First Publish Date - 2021-10-03T20:38:12+05:30

బెంగళూరుకు చెందిన ఏడేళ్ల బాలికను ప్రతిష్ఠాత్మక యునెస్కో గ్లోబల్‌ పీస్‌ ఫొటో అవార్డు వరించింది. ఈ ఘనతను సాధించిన చిన్నారి ఆద్యకు రూ. 85,569 నగదు పురస్కారంతోపాటు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు : బెంగళూరుకు చెందిన ఏడేళ్ల బాలికను ప్రతిష్ఠాత్మక యునెస్కో గ్లోబల్‌ పీస్‌ ఫొటో అవార్డు వరించింది. ఈ ఘనతను సాధించిన చిన్నారి ఆద్యకు రూ. 85,569 నగదు పురస్కారంతోపాటు.. ఆస్ట్రియా పార్లమెంట్‌ను సందర్శించే అరుదైన అవకాశం లభించనుంది. ఈ అవార్డును అందుకున్న మొట్టమొదటి భారతీయురాలు ఆద్య కావడం గమనార్హం..! హెబ్బాల్‌ ప్రాంతంలోని విద్యానికేతన్‌ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న ఆద్య.. తన తల్లి రోషిణి సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీసేది. ఫొటోగ్రఫీలో ఆద్యకు ఉన్న సృజనాత్మకతను గుర్తించిన ఆమె తండ్రి.. వాటిని పలు ఫొటోగ్రఫీ పోటీలకు పంపించారు. ఇందులో.. ‘శాంతి ఒడి’ అనే క్యాప్షన్‌తో తన అమ్మమ్మ ఒడిలో తల్లి రోషిణి విశ్రాంతి తీసుకుంటున్న ఫొటో ప్రపంచ శాంతి ఫొటో పురస్కారానికి ఎంపికైంది. కాగా.. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యునెస్కో ప్రతి సంవత్సరం ఆస్ట్రియా ప్రభుత్వంతో కలిసి ఈ పురస్కారాన్ని అందిస్తోంది.



Updated Date - 2021-10-03T20:38:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising