ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాషింగ్‌ పేపర్‌ బ్యాగ్‌!

ABN, First Publish Date - 2021-03-01T05:25:47+05:30

పేపర్‌ బ్యాగులో మరకలు ఉన్న రుమాళ్లు వేసి వాటిని మ్యాజిక్‌తో తెల్లటి రుమాళ్లుగా మారుస్తానని స్నేహితులతో అనండి. మీ మ్యాజిక్‌ చూసి వాళ్లు ఆశ్చర్యపోతారు. ఈ మ్యాజిక్‌ ఎలా చేయాలంటే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • పేపర్‌ బ్యాగులో మరకలు ఉన్న రుమాళ్లు వేసి వాటిని మ్యాజిక్‌తో తెల్లటి రుమాళ్లుగా మారుస్తానని స్నేహితులతో అనండి. మీ మ్యాజిక్‌ చూసి వాళ్లు ఆశ్చర్యపోతారు. ఈ మ్యాజిక్‌ ఎలా చేయాలంటే...

కావలసినవి

పేపర్‌ బ్యాగులు రెండు (రెండూ సమానవైనవి కాకుండా ఒకటి కాస్త చిన్నదిగా ఉండేలా చూసుకోవాలి), రుమాళ్లు తెల్లవి - మూడు, రుమాళ్లు మరకలు ఉన్నవి - మూడు.


ఇలా చేయాలి!

  1. పేపర్‌ బ్యాగులు రెండు తీసుకోవాలి. ముందుగా పెద్ద పేపరు బ్యాగులో తెల్లటి రుమాళ్లు వేయాలి. తరువాత అదే పేపర్‌బ్యాగులో చిన్న పేపర్‌బ్యాగును పెట్టి రెండు బ్యాగులు ఉన్నట్టు కనిపించకుండా పైన కాస్త మడవాలి. (ఇది ముందుగా చేసి పెట్టుకోవాలి)
  2. ఇప్పుడు స్నేహితుల ముందు పేపర్‌ బ్యాగులో మరకలు ఉన్న రుమాళ్లు పెట్టండి. బ్యాగులో పెట్టే ముందు స్నేహితులకు చూపించండి.
  3. తరువాత పేపర్‌బ్యాగును చేత్తో మూసి పట్టుకుని నోటితో గాలి ఊదండి. అబ్రకదబ్ర అంటూ కాసేపు మ్యాజిక్‌ చేస్తున్నట్టుగా చేసి అరచేత్తో కొట్టి పేపర్‌బ్యాగును పగలగొట్టండి.
  4. అలా కొట్టినప్పుడు లోపల ఉన్న బ్యాగు కాకుండా పైన ఉన్న బ్యాగు మాత్రమే పగులుతుంది. దాంట్లో మీరు పెట్టిన తెల్లటి రుమాళ్లు బయటకు తీసి చూపించండి. అంతే... మీ మ్యాజిక్‌కు అందరూ ఫిదా అయిపోతారు.

Updated Date - 2021-03-01T05:25:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising