ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ సుమో వయస్సు 10... బరువు 85 కేజీలు

ABN, First Publish Date - 2021-01-20T05:30:00+05:30

ఆ చిన్నారి పట్టుపడితే ఎవరైనా సరే మట్టి కరవాల్సిందే. ఆ బుడతడు బరిలో దిగితే ఎంతటి రెజ్లర్‌ అయినా వెనకడుగు వేయాల్సిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిన్నారి పట్టుపడితే ఎవరైనా సరే మట్టి కరవాల్సిందే. ఆ బుడతడు బరిలో దిగితే ఎంతటి రెజ్లర్‌ అయినా వెనకడుగు వేయాల్సిందే. టోక్యోకు చెందిన పదేళ్ల సుమో క్యూటా కుమగై విశేషాలు ఇవి.


పదేళ్ల పిల్లాడంటే 35-40 కేజీల బరువుంటారు. కానీ క్యూటా బరువు 85 కేజీలు. సుమో అంటే ఆ మాత్రం బరువు ఉండాల్సిందే కదా! అందుకే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు క్యూటా. రోజూ 2700 నుంచి 4000 క్యాలరీలు తీసుకుంటాడు. ఒక లీటరు పాలు తాగుతాడు. మాంసం అంటే చాలా ఇష్టం.

 

గత ఏడాది అండర్‌ -10 వరల్డ్‌ ఛాంపియన్‌ ట్రోఫీని గెలుచున్నాడు. క్యూటాకు శిక్షణ ఇచ్చేది ఎవరో తెలుసా? అతని తండ్రే! అతడు శిక్షణ విషయంలో కొడుకు అని ఏ మాత్రం కనికరం చూపించడు. వారంలో ఆరు రోజులు శిక్షణ ఉంటుంది. బరువులు ఎత్తడం, స్విమ్మింగ్‌ చేయడం చేయిస్తుంటారు.


‘‘నా కన్నా పెద్దవాళ్లను ఓడించడంలో బోలెడంత ఫన్‌ దొరుకుతుంది’’ అని అంటాడు క్యూటా. సుమో రెజ్లింగ్‌లో అత్యున్నత ర్యాంక్‌ అయినటువంటి ‘యోకోజునా’ లెవెల్‌కు చేరాలని క్యూటా లక్ష్యంగా పెట్టుకున్నాడు. 


మాజీ రెజ్లర్‌ షినిచి టైరా క్యూటాకు ప్రస్తుతం కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. ‘‘క్యూటాలో టాలెంట్‌ పుష్కలంగా ఉంది’’ అని అంటాడు టైరా.

Updated Date - 2021-01-20T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising