ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ కప్ప చర్మం పారదర్శకం!

ABN, First Publish Date - 2021-07-15T06:03:50+05:30

లోపలి అవయవాలు ఎలా ఉన్నాయో చూసేందుకు ఎక్స్‌రే తీస్తారు. అవసరమైతే స్కానింగ్‌ చేసి చూస్తారు. కానీ ఈ కప్ప విషయంలో మాత్రం అవేమీ అవసరం లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లోపలి అవయవాలు ఎలా ఉన్నాయో చూసేందుకు ఎక్స్‌రే తీస్తారు. అవసరమైతే స్కానింగ్‌ చేసి చూస్తారు. కానీ ఈ కప్ప విషయంలో మాత్రం అవేమీ అవసరం లేదు. ఎందుకంటే ఈ కప్ప చర్మం ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది. అంటే లోపలి అవయవాలన్నీ బయటకు స్పష్టంగా కనిపిస్తుంటాయి. 

భూమిపై మరే జీవి ఇలా ఉండదు. గ్లాస్‌ ఫ్రాగ్‌ అని పిలిచే ఈ కప్ప పారదర్శకమైన చర్మాన్ని కలిగి ఉంటుంది. గ్లాస్‌ ఫ్రాగ్స్‌లో చాలా వరకు లేత ఆకుపచ్చరంగులో ఉంటాయి. కొన్ని కప్పల్లో పొట్ట భాగం మాత్రం ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది.


అంఫీబియన్‌ ఫ్యామిలీకి చెందిన ఈ కప్ప వెనిజులాలోని ఏండిస్‌, టొబాగో ఐలాండ్‌, అమెజాన్‌ నదీ పరీవాహక ప్రాంతంలోనూ, గియానా, ఉత్తర అర్జెంటీనా, వాయువ్య బ్రెజిల్‌లోని కొన్ని ప్రాంతాల్లోనూ కనిపిస్తుంది.

చర్మం పారదర్శకంగా ఉండటం వల్ల గుండె, కాలేయం, జీర్ణకోశానికి సంబంధించిన భాగాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. 

గ్లోబల్‌ వార్మింగ్‌ వల్ల ఈ కప్పలు అంతరించిపోయే స్థితికి చేరుకుంటున్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-07-15T06:03:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising