ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ పోటీ ప్రత్యేకం!

ABN, First Publish Date - 2021-07-03T05:30:00+05:30

రకరకాల పడవ పోటీలు చూసుంటారు. ఆస్ట్రేలియాలో ఏటా జరిగే ఈ పడవ పోటీలు మాత్రం చాలా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రకరకాల పడవ పోటీలు చూసుంటారు. ఆస్ట్రేలియాలో ఏటా జరిగే ఈ పడవ పోటీలు మాత్రం చాలా ప్రత్యేకం. ఎందుకంటారా? ఈ పడవలను తాగి పడేసిన క్యాన్‌లతో తయారుచేస్తారు. ఆ విశేషాలు ఇవి...


 కూల్‌డ్రింక్స్‌ టిన్‌లను తాగి పడేస్తాం. అయితే ఆస్ట్రేలియాలో మాత్రం వాటిని పడవ పోటీలకు దాచిపెడతారు. అలా దాచిన బీర్‌ టిన్‌లు, సోడా టిన్‌లు, కూల్‌డ్రింక్స్‌ టిన్‌లతో చిన్నపాటి పడవలు తయారుచేస్తారు.


 ఏటా జూలై 7న అక్కడ డార్విన్‌ బీర్‌ క్యాన్‌ రెగట్టా పేరుతో పోటీలు జరుగుతుంటాయి. ఇందులో ఖాళీ క్యాన్‌లతో తయారుచేసిన పడవలు మాత్రమే పాల్గొంటాయి. ఈ ఏడాది కూడా పోటీలు నిర్వహించేందుకు అంతా సిద్ధం చేశారు. ఈ పోటీలను ‘బెస్ట్‌ సాఫ్ట్‌ డ్రింక్‌’ కాంపిటీషన్స్‌ అని కూడా పిలుస్తారు.


 మొదటిసారి 1974లో ఈ పోటీలు జరిగాయి. అప్పటి నుంచి ఏటా నిర్వహిస్తున్నారు. కొన్ని పడవలు 1500 క్యాన్‌లతో తయారుచేస్తారు. 12 మీటర్ల పొడవు వరకు ఉంటాయి. కెనడా, బెల్జియం దేశాల నుంచి వచ్చిన పర్యాటకులు కూడా వీటిలో పాల్గొంటారు. పోటీలు నిర్వహించగా వచ్చిన డబ్బును ఛారిటీకి అందజేస్తారు.

Updated Date - 2021-07-03T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising