ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ హంస అతని బెస్ట్‌ ఫ్రెండ్‌!

ABN, First Publish Date - 2021-02-15T07:03:47+05:30

జంతువులు విశ్వాసంగా ఉంటాయని తెలుసు. కానీ ఇక్కడ ఒక హంస దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇంటి యజమానితో స్నేహితు నిగా మెలగడాన్ని చూస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేరు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జంతువులు విశ్వాసంగా ఉంటాయని తెలుసు. కానీ ఇక్కడ ఒక హంస దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇంటి యజమానితో స్నేహితు నిగా మెలగడాన్ని చూస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేరు. టర్నీకి చెందిన మాజీ పోస్ట్‌మ్యాన్‌ మిర్జాన్‌, గారిప్‌(హంస పేరు)ల ఫ్రెండ్‌షిప్‌ స్టోరీ ఇది.



టర్కీలోని ఎడిర్నే ప్రావిన్స్‌కు చెందిన మిర్జాన్‌ పోస్ట్‌మ్యాన్‌గా పనిచేసే వాడు. 1984లో ఒకరోజు స్నేహితులతో కలిసి బయటకు వెళ్లినప్పుడు పొలాల్లో ఒక హంస రెక్కకు గాయంతో పడిపోయి ఉండటాన్ని గమనించాడు. వెంటనే కారు అపి, ఆ హంసను ఇంటికి  తీసుకొచ్చి వైద్యం చేశాడు. 

‘‘నాకు జంతువులంటే ప్రాణం. ఆ హంసను అక్కడ వదిలి రావాలని అనిపించలేదు. దాన్ని ఇంటికి తీసుకొచ్చి చికిత్స చేశాను. ఆ హంస రెండు రోజుల్లో కోలుకుంది. ఆ తరువాత అది ఎగిరి వెళ్లాలని ప్రయత్నించలేదు. నాతోనే ఉండిపోయింది. అలా ఇప్పటికి 37 సంవత్సరాలు గడిచిపోయాయి’’ అని హంసతో తనకున్న అనుబంధాన్ని పంచుకుంటాడు మిర్జాన్‌.

మిర్జాన్‌ ఆ హంసకు గారిప్‌ అని పేరు పెట్టాడు. రోజంతా అది మిర్జాన్‌తోనే తిరుగుతుంది. వాకింగ్‌కు వెళితే  వెంటే వెళుతుంది. రాత్రి వేళ మాత్రం తనకోసం ఏర్పాటు చేసిన తీగల గదిలోకి వెళ్లి పడుకుంటుంది. 

ఫ మిర్జాన్‌కు పిల్లలు లేరు. భార్య చనిపోయిన తరువాత  జంతువుల సంరక్షణకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నాడు.

Updated Date - 2021-02-15T07:03:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising