ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ ప్యాలెస్‌ విలువ రూ.4వేల కోట్లు!

ABN, First Publish Date - 2021-06-18T09:23:37+05:30

ఆ ప్యాలెస్‌ను చూస్తే కళ్లు తిప్పుకోలేరు. 400 గదులతో 12 లక్షల 40 వేల చదరపు అడుగుల్లో విస్తరించి ఉన్న ఆ ప్యాలెస్‌ విలువ రూ.4వేల కోట్లు. ఇంతకీ ఈ లగ్జరీ ప్యాలెస్‌ ఎక్కడుందో తెలుసా?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ ప్యాలెస్‌ను చూస్తే కళ్లు తిప్పుకోలేరు. 400 గదులతో 12 లక్షల 40 వేల చదరపు అడుగుల్లో విస్తరించి ఉన్న ఆ ప్యాలెస్‌ విలువ రూ.4వేల కోట్లు. ఇంతకీ ఈ లగ్జరీ ప్యాలెస్‌ ఎక్కడుందో తెలుసా?


మధ్యప్రదేశ్‌లోని గ్యాలియర్‌లో సింధియా కుటుంబానికి జై విలాస్‌ ప్యాలెస్‌ ఉంది. యూరోపియన్‌ ఆర్కిటెక్చర్‌తో నిర్మించిన ఈ మూడంతస్థుల రాజభవనంలో వస్తువులు, వసతి, సదుపాయాల గురించి ఎంత చెప్పినా తక్కువే. 

ఈ ప్యాలెస్‌ హాల్‌లో ఇంటీరియర్‌ను 560 కేజీల బంగారంతో అలంకరించారు. డైనింగ్‌ టేబుల్‌పై వెండితో తయారుచేసిన మోడల్‌ రైలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అతిథుల కోసం ఈ రైలు పదార్థాలను తీసుకెళుతుంది.

ఈ ప్యాలెస్‌లోని కొన్ని గదులను మ్యూజియంగా మార్చారు. ఇందులో సింధియా రాజవంశానికి చెందిన అపురూపమైన, పురాతన వస్తువులను చూడొచ్చు. 

19వ శతాబ్దంలో మహారాజు జయాజీ రావు సింధియా ఈ ప్యాలెస్‌ నిర్మించారు. అప్పట్లో ఈ నిర్మాణానికి రూ.1 కోటి వెచ్చించారు. ఇప్పుడు ఆ ప్యాలెస్‌ విలువ రూ. 4 వేల కోట్లు. ప్రస్తుతం ఈ ప్యాలెస్‌లో జ్యోతిరాదిత్య సింధియా కుటుంబం నివసిస్తోంది.  

Updated Date - 2021-06-18T09:23:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising