ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నక్కగొప్పలు!

ABN, First Publish Date - 2021-01-04T05:30:00+05:30

ఒక అడవిలో ఓ నక్క నివసిస్తూ ఉండేది. అది బాగా తెలివైందని అన్ని జంతువుల దగ్గర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక అడవిలో ఓ నక్క నివసిస్తూ ఉండేది. అది బాగా తెలివైందని అన్ని జంతువుల దగ్గర గొప్పలు చెప్పేది. ఒకరోజు చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటుండగా దారి వెంట వెళుతున్న కుక్క కనిపించింది. వెంటనే కుక్కను పిలిచి ‘‘శత్రువుల నుంచి తప్పించుకోవడానికి నా దగ్గర కొన్ని వందల ఉపాయాలు ఉన్నాయి’’ అని గొప్పలు పలకడం మొదలుపెట్టింది.


అప్పుడు కుక్క ‘‘నాకు అన్ని ఉపాయాలు రావు. ఒక్కటే వచ్చు. దానితో నేను ప్రమాదాల నుంచి బయటపడుతుంటాను’’ అని చెప్పింది. అప్పుడే సింహాల అరుపు వినిపించింది. కాసేపట్లోనే సింహాలు దగ్గరకు వచ్చేశాయి. వెంటనే కుక్క చెట్టుపైకి ఎక్కి కొమ్మల మధ్య దాక్కుని కూర్చుంది.


‘‘నాకు తెలిసిన ఉపాయం ఇదే. మరి నువ్వేం చేస్తావు’’ అని అడిగింది కుక్క. నక్క ఎలా తప్పించుకోవచ్చో ఆలోచిస్తూ ఉండిపోయింది. అప్పటికే దగ్గరకు చేరుకున్న సింహాలు నక్కపై దాడి చేసి చంపేశాయి.

Updated Date - 2021-01-04T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising