ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పడవ కాదు ఇల్లు!

ABN, First Publish Date - 2021-03-22T05:30:00+05:30

కింది చిత్రం చూస్తే పడవ తిరగబడినట్టుగా ఉంది కదూ! కానీ అది ఆ యజమాని ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లు. ఆ ఊరిలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పై చిత్రం చూస్తే పడవ తిరగబడినట్టుగా ఉంది కదూ! కానీ అది ఆ యజమాని ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లు. ఆ ఊరిలో వాళ్లందరూ ఇళ్లను అలాగే పడవ తిరగబడినట్టుగా నిర్మించుకుంటారు. ఫ్రాన్స్‌లోని ఈక్విహెన్‌ ప్లేజ్‌ అనే గ్రామంలో కనిపిస్తుందీ ఈ దృశ్యం.  


 అక్కడి ప్రజలు రకరకాల ఆకృతుల్లో భవనాలు నిర్మించుకోవడానికి ఇష్టపడరు. తిరగబడిన పడవ ఆకారంలోనే ఇళ్లను కట్టుకుంటారు. అయితే సౌకర్యాల విషయంలో మాత్రం రాజీపడరు. ఆ ఇళ్లలో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసుకుంటారు.


 పడవ ఆకృతుల్లో ఇళ్లు నిర్మించడం కొన్ని దశాబ్దాల క్రితం మొదలయింది. చేపలు పట్టే వారు పాడైన పడవలను తిరగేసి నివాసంగా ఏర్పాటు చేసుకునే వారు. గాలి కోసం కిటికీలు పెట్టుకునేవారు. అది నేటికీ కొనసాగుతోంది. సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగించాలనే ఉద్దేశంతో ఇప్పటికీ ఇళ్లను అలాగే నిర్మించుకుంటున్నారు.


 ఈ గ్రామాన్ని సందర్శించడానికి పర్యాటకులు ఆసక్తి చూపుతుంటారు. ఆ ఇళ్లలో గడపడానికి ఇష్టపడుతుంటారు. అది ఆ గ్రామ ప్రజలకు ఆదాయ వనరుగానూ మారింది. పర్యాటకుల కోసమే వాళ్లు ఇళ్లలో సకల సదుపాయాలను  ఏర్పాటు చేస్తున్నారు.


Updated Date - 2021-03-22T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising