ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ సినిమాలు తీసింది ఇక్కడే!

ABN, First Publish Date - 2021-02-25T05:34:22+05:30

కొన్ని సినిమాలు చూస్తుంటే వాటిని ఎక్కడ చిత్రీకరించారో తెలుసుకోవాలన్న కుతుహులం కలుగుతుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొన్ని సినిమాలు చూస్తుంటే వాటిని ఎక్కడ చిత్రీకరించారో తెలుసుకోవాలన్న కుతుహులం కలుగుతుంది. అలాంటి కొన్ని సినిమాలు చిత్రీకరణ జరుపుకొన్న ప్రాంతాలు ఇవి.


జాస్‌ : స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ తీసిన ‘జాస్‌’ సినిమా చూసి ఉంటే ఈ చిత్రాన్ని మీరు గుర్తుపడతారు. ఒక షార్క్‌ మనుషులపై దాడి చేసి చంపడాన్ని ఇతివృత్తంగా తీసుకుని తీసిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా ఎక్కువ భాగం మసాచుసెట్స్‌లోని మార్తా వైన్‌యార్డ్‌లో చిత్రీకరణ జరుపుకొంది.



బ్రేకింగ్‌ బ్యాడ్‌ : టీవీ షోల్లో ఆల్‌ టైం హిట్‌గా ‘బ్రేకింగ్‌ బ్యాడ్‌’ షో గుర్తింపు పొందింది. అవార్డులను సైతం సొంతం చేసుకుంది. ఈ షోలో ఎక్కువ భాగం న్యూమెక్సికోలోని అల్బుకెర్కీలో చిత్రీకరించారు. ఈ చిత్రంలో  కనిపిస్తున్న రెస్టారెంట్‌ అదే.



ఫారెస్ట్‌ గంప్‌ : ఈ సినిమా యూఎస్‌లోని రకరకాల ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకొంది. వార్‌ సీన్స్‌, సినిమాలో ఓ క్యారెక్టర్‌ పరుగెత్తే దృశ్యాలను నార్త్‌ కరోలినాలోని బ్లూ రిడ్జ్‌ పార్క్‌వే దగ్గరే చిత్రీకరించారు. ఆ ప్రాంతం ఇదే.



స్ట్రేంజర్‌ థింగ్స్‌ : ఈ సినిమా చిత్రీకరణ ఎక్కువ భాగం అట్లాంటా, జార్జియాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగింది. హైస్కూల్‌ దృశ్యాలు స్టాక్‌బ్రిడ్జ్‌లోని పాట్రిక్‌ హెన్రీ హైస్కూల్‌ పరిసరాల్లో తీశారు.



ది నోట్‌బుక్‌ : ‘నికోలస్‌ స్పార్క్స్‌’ నవల ఆధారంగా తీసిన సినిమా ఇది. ఇందులో ప్రధానపాత్ర పోషించిన రాచెల్‌ మెక్‌ఆడమ్స్‌ ఇంటి దృశ్యాలను బూన్‌ హాల్‌ ప్లాంటేషన్‌గా గుర్తింపు పొందిన ఈ ప్రదేశంలోనే చిత్రీకరించారు.


Updated Date - 2021-02-25T05:34:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising