ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈజిప్ట్‌ కంటే ఎక్కువ!

ABN, First Publish Date - 2021-06-04T05:30:00+05:30

ఈజిప్ట్‌ పేరు చెప్పగానే మీకు ఏం గుర్తుకువస్తుంది? పిరమిడ్స్‌ కదూ! అపురూపమైన పిరమిడ్స్‌కు ఈజిప్ట్‌ పెట్టింది పేరు. అందుకే పిరమిడ్‌ ఆ దేశానికి పర్యాయ పదంగా మారిపోయింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈజిప్ట్‌ పేరు చెప్పగానే మీకు ఏం గుర్తుకువస్తుంది? పిరమిడ్స్‌ కదూ! అపురూపమైన పిరమిడ్స్‌కు ఈజిప్ట్‌ పెట్టింది పేరు. అందుకే పిరమిడ్‌ ఆ దేశానికి పర్యాయ పదంగా మారిపోయింది. కానీ... పిరమిడ్స్‌ ఎక్కువగా ఉన్న దేశం ఈజిప్ట్‌ కాదు... తెలుసా? మరి..? సుడాన్‌! అవును... ఈజిప్ట్‌ కంటే సుడాన్‌లోనే ఇవి ఎక్కువ ఉన్నాయి. నిజంగా ఇది నమ్మలేని నిజం. అక్కడి నూబియా ప్రాంతంలో ఒకటీ రెండూ కాదు... 255 పిరమిడ్స్‌ ఉన్నాయి. అంటే ఈజిప్ట్‌లోని పిరమిడ్‌ల సంఖ్య కంటే ఇది రెట్టింపు! 25వ శతాబ్దంలో ఈజిప్ట్‌ను ఏలిన నూబియన్‌ ఫరాలు, తరువాత అక్కడి నుంచి సుడాన్‌కు పారిపోయారు. కుషైట్‌ రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. ఈజిప్ట్‌ శైలిలో కొత్త నగరాన్ని నిర్మించారు. అయితే నూబియన్‌ పిరమిడ్స్‌ను సందర్శించే పర్యాటకులు చాలా స్వల్పం. అందుకే వీటి గురించి ప్రపంచానికి పెద్దగా తెలియదు. ఒక చిన్న పర్వతం పక్కన ఉండే ఈ పిరమిడ్స్‌ నేటికీ చెక్కుచెదరలేదంటే అది నాటి దృఢమైన నిర్మాణ శైలికి నిదర్శనం. సూర్యాస్తమయానికి ముందు ఆ పర్వతంపై నుంచి ఈ పిరమిడ్స్‌ను వీక్షిస్తే మీ కళ్లను మీరే నమ్మలేనంత అద్భుతంగా ఉంటుందా దృశ్యం. 

Updated Date - 2021-06-04T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising